తన సహజీవనం గురించి క్లారిటీ ఇచ్చిన శృతీ. ట్వీట్ లో సారీ

First Published 18, Feb 2018, 1:17 PM IST
shruthi haasan gives clarity about her boy friend
Highlights
  • శృతీ హాసన్, మైఖేల్ ల బంధంపై కన్ఫ్యూజన్
  • ఇవాళ మైఖేల్ కోర్సెల్ పుట్టిన రోజు
  • ఈ సందర్భంగా చేసిన ట్వీట్ లో తమ బంధంపై క్లారిటీ ఇచ్చిన శృతి

లండన్ బోయ్ ఫ్రెండ్ మైఖేల్ తో శృతీహాసన్ కు వున్న సంబంధంపై క్లారిటీ లేక అంతా కన్ ఫ్యూజన్ లో వున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తన రిలేషన్‌షిప్ గురించి శృతిహాసన్ ఓట్వీట్ లో క్లారిటీ ఇచ్చింది. ఇద్దరూ అన్యోన్యంగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముంబై ఎయిర్‌పోర్టులో వారిద్దరూ కలుసుకొని ముద్దులు పెట్టుకొంటున్న ఫొటోలు, ప్రియుడితో కలిసి పెళ్లికి కొద్దిరోజుల క్రితం చెన్నైలో జరిగి ఓ వివాహానికి తండ్రి కమల్ హాసన్‌తో కలిస కోర్సలే‌, శృతిహాసన్ హాజరుకావడం మీడియాలో హల్‌చల్ చేసింది. కోర్సలే హిందూ సంప్రదాయ దుస్తుల్లో కనిపించి ఆకట్టుకొన్నాడు.

 

దీంతో శృతికి పెళ్లి జరిగినట్టు కూడా వార్తలు కూడా వెలువడ్డాయి. ఇలాంటి వార్తల నేపథ్యంలో తన అఫైర్ గురించి క్లారిటీ ఇచ్చేసింది. కోర్సలే బర్త్ డే సందర్భంగా ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టింది. శృతిపెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

నేను చేసే ప్రతీ నేరంలో వెంట నిలిచే నా బెస్ట్ ఫ్రెండ్, పార్ట్నర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఆర్ట్ వరల్డ్‌లో నాతో అండగా నిలవడమే కాదు.. నాతో జీవిత ప్రయాణం కూడా చేస్తాడు. నా సంతోషంలో భాగమవుతాడు అని పేర్కొన్నది. నీ జీవితంలో గొప్ప క్షణాలు ఆస్వాదించే సమయంలో నేను నీ పక్కన లేకపోవడం బాధగా ఉంది. అందుకు నేను క్షమాపణ చెబుతున్నాను. బంగారం లాంటి వాడివి అంటూ శృతిహాసన్ ట్యాగ్ చేసింది. శృతిహాసన్ పోస్టుకు అనూహ్య స్పందన లభించింది. సమంత అక్కినేని, కత్రినాకైఫ్, ప్రియా ప్రకాశ్ వారియర్, షారుక్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తదితరలు ట్వీట్ చేసి మైఖేల్‌ను అభినందించారు. అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

 

శృతి ప్రస్తుతం శృతిహాసన్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తండ్రి కమల్ రూపొందించే శభాష్ నాయుడు సినిమా తప్పా చేతిలో మరో చిత్రం లేదు. పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్న కారణంగానే ఆమె సినిమాలపై ఆసక్తి చూపించడం లేదనే వాదన వినిపిస్తున్నది.

loader