ఆ ఇద్దరు బడా నిర్మాతలపై శ్రియ సంచలన ఆరోపణలు

ఆ ఇద్దరు బడా నిర్మాతలపై శ్రియ సంచలన ఆరోపణలు

స్టార్ హీరో సెట్ లోకి వస్తున్నాడంటే... సదరు హీరోకు ఎలాంటి లోటు పాట్లు లేకుండా నిర్మాతలు జాగ్రత్త పడుతారు. అయితే హీరోయిన్ల విషయినికొచ్చేసరికి మాత్రం ఈ విషయాన్ని నిర్మాతలు పెద్దగా లెక్క చేయనట్లే కనిపిస్తోంది. తాజాగా శ్రియ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయాలు ఆశ్యర్యపరుస్తున్నాయి.

 

సాధారణంగా అవుట్ డోర్ షూటింగ్స్ జరిగినప్పుడు హీరోయిన్ల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించాల్సి వుంది. సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయకుంటే.. కాలకృత్యాలు తీర్చుకోవడం ఎంత కష్టంగా మారుతుందో చెప్పలేం. బయటకు చెప్పలేక, కడుపు ఉగ్గపట్టుకోలేక హిరోయిన్లు నరకయాతన అనుభవించాల్సి వస్తుంది. తాజాగా హీరోయిన్ శ్రియకు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైందట. షూటింగ్‌ సమయంలో హీరోయిన్లు సకల సౌకర్యాలు అనుభవిస్తారని అంతా అనుకుంటారని, కానీ నిజాలు మాత్రం వేరని శ్రియ అంటోంది.

 

ఇటీవల తాను చేసిన 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమా షూటింగ్ సమయంలో.. వాష్ రూం వెళ్లాలంటే 15కి.మీ వెళ్లాల్సి వచ్చేదని శ్రియ చెప్పారు. ఇక 'పైసా వసూల్' పోర్చుగల్ షూటింగ్ సమయంలో కూడా.. వాష్ రూం వెళ్లాలంటే, ఏకంగా వంద మెట్లు ఎక్కి దిగాల్సి వచ్చేదని చెప్పారు. దీంతో ఆ బాధ నిలువరించేందుకు షూటింగ్ సమయంలో తాను నీళ్లు తాగడమే తగ్గించేశానని, ఎంత దాహమైనా.. కేవలం గొంతు తడుపుకునే దాన్ని తప్పితే, కడుపు నిండా నీళ్లు తాగకపోయేదాన్ని అని చెబుతున్నారు. మామూలు సమయాల్లో ఇలాంటి సమస్యలు పెద్దగా ఇబ్బంది పెట్టకపోయినా... నెలసరి సమయాల్లో మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయంటున్నారు శ్రియ.

 

అయితే సమస్య లేకుండా ఏ మనిషి ఉండడు, అసలు కష్టం లేకుండా ఏ పనీ దొరకదు అని జీవిత పాఠాలు కూడా చెబుతున్నారు శ్రియ. కష్టాలను ఇబ్బందిగా ఫీలైతే మంచి అవకాశాలు కోల్పోతామని చెబుతోంది. వాటిని ఎదుర్కోవాలి తప్పితే బాధపడాల్సిన అవసరం లేదంటోంది. వినేవాళ్లకు ఈ కష్టాలు చాలా చిన్నవిగా అనిపించవచ్చు కానీ వాటిని ప్రత్యక్షంగా అనుభవించేవాళ్లకే ఆ బాధలేంటో తెలుస్తుందని అంటున్నారు శ్రియ.

 

అయితే ఇలాంటి ఎన్నో కష్టాలకోర్చి సినీ పరిశ్రమలో సుదీర్ఘ కాలం పాటు కెరీర్ కొనసాగిస్తూ.. 17 ఏళ్ల నుంచి శ్రియ నిలకడగా రాణిస్తోంది శ్రియ. పాత ముఖాలతో చేయడానికి ఇష్టపడని దర్శకనిర్మాతలు, హీరోలు ఉన్న చోట.. ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తుండటం శ్రియ గొప్పదనం, టాలెంట్.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos