శ్రీయ శరన్ దాదాపు ఒకటిన్నర దశాబ్దానికి పైగా టాలీవుడ్ లో రాణిస్తోంది. తెలుగులో స్టార్ హీరోలందరితో శ్రీయ నటించింది. ప్రస్తుతం టాలీవుడ్ లో కుర్ర హీరోయిన్ల హవా ఎక్కువైంది. దీనితో సహజంగానే శ్రీయ శరన్ లాంటి సీనియర్ భామలకు అవకాశాలు తగ్గుతాయి. అయినా కూడా తరచుగా శ్రీయ మంచి అవకాశాలు అందుకుంటోంది. 

శ్రీయ ఇటీవల కమర్షియల్ చిత్రాల్లో అవకాశం వస్తే చేస్తూనే.. విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటోంది. మనం చిత్రంలో నత్తి ఉన్న అమ్మాయిగా  తెలిసిందే. పవిత్ర చిత్రంలో వేశ్యగా, గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రంలో తల్లిగా నటించింది. తాజాగా శ్రీయ మరో సాహసోపేతమైన పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

ఓ డెబ్యూ దర్శకుడు తెరకెక్కించబోయే చిత్రంలో శ్రీయ వినికిడి లోపం ఉన్న మహిళగా నటించబోతోంది. ఈ చిత్రంలో ఎమోషనల్ సన్నివేశాలు తారాస్థాయిలో ఉంటాయట. నటనకు పూర్తి అవకాశం ఉన్న చిత్రం కావడంతో శ్రీయ అంగీకరించినట్లు తెలుస్తోంది. 

ఈ చిత్రంలోని ప్రతి పాత్రని దర్శకుడు బలంగా రాసుకున్నాడట. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.