తెలుగు హిరోయిన్లలో దశాబ్దం దాటినా సీనియర్ నటి శ్రియకు మాత్రం గ్లామర్ పాళ్లు ఏ మాత్రం తగ్గడంలేదు. పైగా మరింత గ్లామర్ పెంచుతోంది. ఇటీవల బాలయ్య శాతకర్ణి, పైసా వసూల్ సినిమాల్లో కనిపించిన శ్రియ గ్లామర్ షోతో ప్రమోషన్ ఈవెంట్లలోనూ అద్దరగొట్టింది.

 

'ఇష్టం' నుంచి 'పైసావసూల్‌' సినిమా వరకూ... శ్రియ చాలా తెలుగు సినిమాల్లో నటించింది. అటు తమిళ, హిందీ సినిమాల్లోనూ మెరిసింది. సినిమా సినిమాకీ గ్లామర్‌ పెంచేసుకుంటూ పోవడం.. శ్రియ ప్రత్యేకత.

 

సాధారణంగా అయితే ఫిట్‌నెస్‌ మీద శ్రద్ధ ఆసక్తి తగ్గి ఆ తర్వాత బాడీ షేప్ లో దారుణమైన మార్పులు వచ్చేయడం చాలా హీరోయిన్ల విషయంలో చూస్తుంటాం. కానీ శ్రియ పరిస్థితి అందుకు పూర్తి భిన్నం. 'ఇష్టం'లో ఎలావుందో,  ఇప్పుడూ అలాగే వుంది. అప్పటికీ ఇప్పటికీ తన ఫిగర్‌ ను ఇంకా మెరుగుపరుచుకుని పర్ పెక్ట్ గా తయారైంది.

 

ఇదిగో, శ్రియ ఫిట్‌నెస్‌కీ, పెర్‌ఫెక్ట్‌ ఫిగర్‌కీ బెస్ట్‌ ఎగ్జాంపుల్‌. అండర్‌ వాటర్‌ ఫొటోగ్రఫీలో శ్రియ టూ పీస్‌ బికినీ గ్లామర్‌ ఓ రేంజ్‌లో కన్పిస్తోంది కదూ.! ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఏంటని అడిగితే, యోగా చేయడం, రెగ్యులర్‌ ఎక్సర్‌సైజ్‌లు.. వీటితోపాటు సరైన ఆహారం, కంటినిండా నిద్ర.. అని సమాధానం చెబుతుంటుంది శ్రియ. మరోవైపు తాను మంచి డాన్సర్‌ గనుక, డాన్స్‌ తోనూ తన ఫిగర్‌ ఏ మాత్రం డీ గ్లామర్ కాకుండా వర్కవుట్ చేస్తోంది శ్రియ.