ఇండియన్ బాక్స్ ఆఫీస్ లెక్కలను  ఒక్కసారిగా మార్చేసిన బాహుబలి సినిమాను ఎవరు అంత ఈజీగా మర్చిపోలేరు. రెండు భాగాలుగా వచ్చిన ఆ సినిమా కథను ఇంకా పొడిగిస్తే బావుంటుందని అంతా అనుకున్నారు. కానీ దర్శకుడు రాజమౌళి మాత్రం సినిమాగా అంతే ఉంటె బావుంటుందని డ్రాప్ అయిపోయాడు. 

ఇక నిర్మాతలు శోబు, ప్రసాద్ నెట్ ఫ్లిక్స్  సిరీస్ ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి బిగినింగ్ కు ముందు ఎలాంటి కథనం ఉంటుందో ప్రేక్షకులకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ చూపడంతో అనేక సందేహాలకు రూపం ఇస్తున్నారు. ప్రవీణ్ సత్తారు - దేవాకట్టా ఈ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు. 

ఇకపోతే ఈ నెట్ ఫ్లిక్స్ సిరీస్ లో సీనియర్ సౌత్ హీరోయిన్ శ్రీయా కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించనుంది. రీసెంట్ గా ఈ బ్యూటీని చిత్ర యూనిట్ సభ్యులు ఫైనల్ చేశారు. గత కొంత కాలంగా శ్రీయ కూడా మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. అయితే ఆమె ఏ పాత్రలో కనిపించనుందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఇక చివరగా అమ్మడు వీర బోగ వసంత రాయలు అనే మినీ మల్టీస్టారర్ లో నటించిన సంగతి తెలిసిందే.