సమంతా కన్నా ముందే అక్కినేని కోడలయ్యే ఛాన్స్ మిస్ అయిన శ్రేయా భూపాల్ త్వరలో పెళ్లి చేసుకోబోతోంది అనే వార్త ఇప్పుడు మీడియా సర్కిల్స్ లో బాగా చక్కర్లు కొడుతోంది. అఖిల్ తో నిశ్చితార్థం దాకా వచ్చి ఆ తర్వాత ఆగిపోయిన సెలబ్రిటీ ఫ్యామిలీ మ్యారేజ్ ఈ మధ్య కాలంలో ఇదొక్కటే. కొన్నాళ్ళు ఇది వాళ్ళను డిస్ట్రబ్ చేసినా త్వరగానే సర్దుకుని ఆ తర్వాత సెట్ అయిపోయారు. ఇక ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం శ్రేయా భూపాల్ అతి త్వరలో అనిన్ దిత్ తో జంట కట్టబోతోందని దాని సారాంశం. ఈ అనిన్ దిత్ ఎవరో కాదు. రామ్ చరణ్ సతీమణి ఉపాసనకు స్వయానా కజిన్. జివికె కుటుంబం నుంచి వస్తున్న అమ్మాయి కాబట్టి అబ్బాయి వైపు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ త్వరగానే వచ్చిందట. కాని ఇది అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ చేయలేదు.

ఇటు పక్క అఖిల్ పెళ్లి మాత్రం ఇప్పట్లో జరిగే అవకాశాలు మాత్రం లేనట్టే. హీరోగా సక్సెస్ అందుకుని కాస్త సెటిల్ అయ్యాక మెల్లగా చూద్దామనే ఆలోచనలో నాగార్జున ఉన్నట్టు టాక్. నాగార్జున సైతం అఖిల్ సినిమాల విషయం తప్ప వేరే ఏ విషయం ప్రస్తావించడం లేదు. హలో తర్వాత చేయాల్సిన మూవీ గురించి కూడా అఖిల్ ఇంకా ఒక క్లారిటీకి రాలేకపోతున్నాడు. శ్రేయా భూపాల్ పెళ్లి మాత్రం వీలైనంత త్వరగా చేయాలనీ ఇరు కుటుంబాలు ఓ నిర్ణయం  తీసుకున్నట్టు తెలిసింది. కాని వారిలో ఎవరో ఒకరు అధికారికంగా చెప్పే దాకా ఇది నిజమని చెప్పలేం. న్యూ యార్క్ లోని పార్సన్స్ స్కూల్ అఫ్ డిజైన్ లో కోర్స్ చేసిన శ్రేయా భూపాల్ ప్రస్తుతం అదే వృత్తిలో ఉంది. శ్రేయా భూపాల్ పెళ్లి సంగతి సరే మరి అఖిల్ గురించి నాగ్ ఎప్పుడు చెప్తాడా అని ఎదురు చూస్తున్నారు అక్కినేని అభిమానులు