రీసెంట్ గా బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ ఇంటివాడు అయ్యిన సంగతి తెలిసిందే. చిన్ననాటి స్నేహితురాలు నటాశా దలాల్ తో ఏడడుగులు వేసి జీవిత  భాగస్వామిని చేసుకున్నాడు. ముంబై అలిబాగ్ లోని రెస్టారెంట్ లో చాలా కొద్ది మంది బంధువులు, మిత్రుల మధ్య జరిగిన ఈ వివాహ మహోత్సవం వైభవంగా జరగగా.. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు వరుణ్.  లైఫ్ లాంగ్ లవ్ అఫిషియల్ అయిపోయింది అంటూ అభిమానులతో తన సంతోషాన్ని పంచుకున్నాడు. దీంతో ఫ్యాన్స్ తో పాటు సెలబ్రిటీలు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ కంగ్రాట్స్ చెప్తున్నారు.

ఎంతో మంది ఆయన అభిమానులు, ఇండస్ట్రీ స్నేహితులు, వెల్ విషర్స్ వివాహ శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. అందరూ ఒకెత్తు నానితో జెర్సీ సినిమాలో చేసిన శ్రద్దా శ్రీనాధ్ ఒకెత్తు. ఆమె ఓ ప్రక్క మ్యారేజ్ విషెష్ తెలియచేస్తూనే ..సెటైర్స్ వేసింది. సినిమా హీరోయన్స్ కు  వివాహం జరిగినప్పుడు మీడియా వాళ్లు వేసే ప్రశ్నలను వ్యంగ్యంగా గుర్తు చేసింది. ఆమె పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. 

ఆ పోస్ట్ లో ...మరో గ్రేట్ యాక్టర్ పెళ్లి చేసుకున్నాడు. అతన్ని మళ్లీ స్క్రీన్ మీద చూడాలేమేమో . ఇతర హీరోయిన్స్ తో నటిస్తూ తెరపై కనపడటానికి భార్య నటాషా, అత్తగారు ఒప్పుకోరు. దాంతో ఇక మీదట మేల్ ఓరియంటెడ్ సినిమాలు చేయాలేమో..! పర్సనల్ లైఫ్ ను, వర్క్ లైఫ్ ను ఎలా బ్యాలెన్స్ చేస్తాడో..ఏదైమైనా మనం అతన్ని మిస్ అవుతున్నాం. వివాహ శుభాకాంక్షలు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. కొందరు కరెక్ట్ గా అన్నావు అని మెచ్చుకుంటూంటే ...రాంగ్ టైమ్ ఇది. శుభమా అని పెళ్లి చేసుకుంటూంటే నీ సెటైర్స్ ఏమిటని మరికొందరు ఆమెను ప్రశ్నిస్తున్నారు.  ప్రస్తుతం శ్రద్ద బాలీవుడ్ లో బిజీగా ఉంది. 
 
ఇక  వ‌రుణ్ ధావ‌న్- న‌టాషాల వివాహ వేడుక‌కు కుటుంబ స‌భ్యులు టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసారు. ప్రాంగ‌ణం ద‌గ్గ‌ర బౌన్స‌ర్స్, పోలీస్ బందోబ‌స్త్‌, సిసీ కెమెరాలు, ఫ్లెక్సీలు పెట్టారు. మీడియాను కూడా ఈ వేడుక‌కి అనుమ‌తించ‌డం లేద‌ు.  కాగా, కొన్నాళ్ల‌పాటు డేటింగ్‌లో ఈ జంట ఎట్ట‌కేల‌కు వివాహం చేసుకున్నారు. గ‌త ఏడాది చేసుకోవాల‌ని అనుకున్న‌ప్ప‌టికీ, కరోనా వ‌ల‌న స్మాల్ బ్రేక్ తీసుకున్నారు. 

 వరుణ్‌ పెండ్లి వేడుకలకు కరణ్‌ జోహార్‌, శశాంక్‌ ఖైతాన్‌ వంటి కొద్దిమంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. మరోవైపు వచ్చేవారం ముంబైలోని ఓ స్టార్‌ హోటల్‌లో బాలీవుడ్‌ ప్రముఖులు, బంధు మిత్రుల కోసం వరుణ్‌, నటాషాలు భారీ రిసెప్షన్‌ ఇవ్వనున్నారు.