వెంకటేశ్ ‘సైంధవ్’ హీరోయిన్ గా ‘జెర్సీ’ భామ.. ఆసక్తికరంగా ఫస్ట్ లుక్ పోస్టర్.. డిటేయిల్స్
విక్టరీ వెంకటేశ్ - శైలేష్ కొలను కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘సైంధవ్’. ప్రస్తుతం రెండో షెడ్యూల్ జరుగుతోంది. తాజాగా హీరోయిన్ ను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.
ఫ్యామిలీ సినిమాలతో అలరిస్తూ వచ్చిన విక్టరీ వెంకటేశ్ (Venkatesh).. ప్రస్తుతం యాక్షన్ సినిమాలపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో రా అండ్ రస్టిక్ యాక్షన్ మూవీగా ‘సైంధవ్’ చిత్రం రాబోతోంది. ఈ చిత్రానికి ‘హిట్ వర్స్’తో సక్సెస్ అందుకున్న శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. టైటిల్ కూడా అదిరిపోయింది. వెంకీ ఫస్ట్ లుక్ పోస్టర్ సైతం ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది.
ఇక తాజాగా Saindhav హీరోయిన్ గా శ్రద్ధా శ్రీనాథ్‌ని పరిచయం చేశారు. మనోగ్న్య అనే పాత్రలో అలరించబోతోంది. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. పోస్టర్ లో చీర కట్టుకుని, లోతైన ఆలోచనల్లో కూరుకుపోయింది శ్రద్ధా. చాలా సీరియస్‌గా కనిపిస్తోంది. చేతిలో లంచ్ బాక్స్ పట్టుకొని కారులో కూర్చుని తనకు ఎడమవైపు చూస్తూ దేన్నో గమనిస్తున్నట్టుగా కనిపించింది.
మనోజ్ఞ అనే క్యారెక్టర్ ఇప్పటి వరకు శ్రద్ధకు వచ్చిన బెస్ట్ గా భావిస్తున్నారు. ఇది పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్ గా ఉంటుందని తెలుస్తోంది. నేచురల్ స్టార్ నాని ‘జెర్సీ’లో శ్రద్ధా శ్రీనాథ్ తన నటనకు ప్రశంసలు అందుకుంది. దీంతో ‘సైంధవ్’లోనూ మనోగ్న్యగా ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంతోనే టాలీవుడ్ కు అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి పాత్రకు దాని స్వంత ప్రాముఖ్యత ఉన్న స్టార్-స్టడెడ్ చిత్రం ఇది. అందుకు తగ్గట్టుగానే టెక్నికల్ టీమ్ ను ఎంచుకున్నారు.
విక్టరీ వెంకటేష్ - శైలేష్ కొలను కాంబోలో వస్తున్న ఈ చిత్రాన్ని వెంకట్ బోయనపల్లి, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వెంకటేష్ కు ఇది 75వ చిత్రం. సైంధవ్ ప్రస్తుతం వైజాగ్‌లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇప్పటికే హైదరాబాద్‌లో తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. చిన్న విరామం తర్వాత ప్రధాన తారాగణంతో రెండో షెడ్యూల్ వైజాగ్‌లో జరుగుతోంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఎస్ మణికందన్ కెమెరా క్రాంక్ చేయగా, గ్యారీ బిహెచ్ ఎడిటర్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్, కిషోర్ తాళ్లూరు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా 2023 డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.