సాహో సినిమాతో టాలీవుడ్ కి పరిచయం కానున్న సాహో బ్యూటీ మరోసారి పర్సనల్ విషయంతో హాట్ టాపిక్ గా మారింది. ఆమె లవ్ మ్యారేజ్ కి సంబందించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాది చివరలో బేబీ తన చిన్ననాటి స్నేహితుడిని వివాహం చేసుకోబోతున్నట్లు బాలీవుడ్ లో గట్టి టాక్ వచ్చింది. 

శ్రద్దా బాయ్ ఫ్రెండ్ రోహన్ శ్రేష్టా ఫొటోగ్రాఫర్ గా కొనసాగవుతున్నాడు. అయితే  శ్రద్దా కపూర్ తండ్రి శక్తి కపూర్ ఫైనల్ గా రూమర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ ఏడాది చివరలో తన కూతురు పెళ్లి చేసుకోవడం లేదని వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆన్సర్ ఇచ్చారు. అయితే అసలు పెళ్లెప్పుడు అనే విషయంపై ఆయన ఫుల్ క్లారిటీ ఇవ్వలేదు. 

బాలీవుడ్ లోని ప్రముఖ మీడియా కథనాల ప్రకారం వచ్చే ఏడాది సమ్మర్ లో అతికొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో సాహో సుందరి పెళ్లి చేసుకునున్నట్లు తెలుస్తోంది, మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని నెలలు వెయిట్ చేయాల్సిందే. ఇక సాహో సినిమా వరల్డ్ వైడ్ గా ఈ ఆగస్ట్ 15కి రిలీజ్ కానుంది.