బాలీవుడ్ లో మరో బయోపిక్ సైనా నెహ్వాల్ బయోపిక్ లో శ్రద్ధాకపూర్ బ్యాడ్మింటన్ పాఠాలు నేర్చుకుంటున్న శ్రద్ధాకపూర్
క్రీడాకారుల జీవిత కథల ఆధారంగా బాలివుడ్ లో ఇప్పటి వరకు చాలా సినిమాలే వచ్చాయి. త్వరలోనే మరో కథ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవిత కథ. ఈ సినిమాలో సైనా నెహ్వాల్ పాత్రను బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ నటిస్తున్నారు.
ఒకరి జీవిత కథను సినిమాగా తీస్తున్నప్పుడు వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుంటార్న విషయం మనకు తెలిసిందే. అయితే.. అందులో ప్రధాన పాత్ర పోషించే వారు.. వారి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయాల్సి ఉంటుంది. నిజ జీవితంలో ఆ వ్యక్తి ఎలా ఉంటారో.. సినిమాలోనూ అదే కనిపించాలి లేకపోతే.. మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది.
అందుకే శ్రద్ధాకపూర్.. బయోపిక్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోంది. సైనా నెహ్వాల్ దగ్గర నుంచి కోచింగ్ కూడా నేర్చుకుంటోంది. ఈ విషయాన్ని సైనా.. తన ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్, శ్రద్ధాకపూర్, సైనా లు కలిసి దిగిన ఫోటోని సైనా ట్వీట్ చేశారు.
ఇప్పటికే బాలీవుడ్ లో జీవిత కథల ఆధారంగా ‘ఎంఎస్ ధోని’, ‘బాగ్ మిల్కాబాగ్’, ‘మేరీకోమ్’, ‘సచిన్- ది బిలియన్ డ్రీమ్స్ ’ చిత్రాలు వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరి ఈ కథ ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
