బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ 'సాహో' సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతుంది. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా ఆగస్ట్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఇలా ఉండగా.. ఇప్పుడు శ్రద్ధా కపూర్ ని ఓ రీమేక్ కోసం సంప్రదిస్తున్నారని సమాచారం. 

కొరియన్ సినిమా 'మిస్ గ్రానీ'కి రీమేక్ గా తెలుగులో 'ఓ బేబీ' సినిమాను తెరకెక్కిస్తున్నారు. నిర్మాత సురేష్ బాబు 'మిస్ గ్రానీ' అన్ని భాషల రీమేక్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. తెలుగులో ఈ సినిమా రిలీజ్ కి దగ్గర పడుతుండడంతో ఇప్పుడు బాలీవుడ్ లో కూడా రీమేక్  చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

హీరోయిన్ శ్రద్ధా కపూర్ ని బాలీవుడ్ రీమేక్ లో నటించమని అడుగుతున్నారట. బాలీవుడ్ లో టాప్ ప్రొడక్షన్ హౌస్ లో కలిసి సురేష్ బాబు ఈ సినిమాను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. రానా దగ్గుబాటి ఈ సినిమా విషయమై ప్రస్తుతం ముంబైకి వెళ్లారట. 

అన్నీ ఫైనల్ అయితే త్వరలోనే సినిమాకు సంబంధించిన అధికార ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం సురేష్ బాబు 'వెంకీ మామ' సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం కాశ్మీర్ వెళ్లారు.