బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్.. సైనా నెహ్వాల్ బయోపిక్ నుండి తప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ బాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో సైనా పాత్ర కోసం శ్రద్ధాని తీసుకున్నారు.

పాత్ర కోసం ఆమె పుల్లెల గోపీచంద్ వద్ద నెల రోజుల పాటు బాడ్మింటన్ లో శిక్షణ కూడా తీసుకున్నారు. సినిమా ప్రీలుక్ ని కూడా వదిలారు. కానీ ఇప్పుడు సడెన్ గా శ్రద్ధాకి డెంగీ ఫీవర్ వచ్చిందని, అందుకే ఆమెని సినిమా నుండి తప్పించినట్లు నిర్మాణ సంస్థ టీ సిరీస్ వెల్లడించింది. 

శ్రద్ధ స్థానంలో పరినీతిని తీసుకున్నట్లు తెలిపారు. నిజానికి శ్రద్ధాకి డెంగీ ఫీవర్ వచ్చి చాలా రోజులైంది. దాన్ని నుండి ఆమె రికవర్ అయ్యి రెగ్యులర్ సినిమా షూటింగ్స్ లో కూడా పాల్గొంటుంది. ఇటువంటి సమయంలో ఇలాంటి కారణం చెప్పి చిత్రబృందం ఆమెని తప్పించడం పలు సందేహాలకు దారి తీస్తుంది.

శ్రద్ధాని కావాలని తప్పించారా..? లేక ఆమె తప్పుకుందా..? అనే విషయాలో స్పష్టత లేదు. ప్రస్తుతం ఆమె తెలుగులో 'సాహో' బాలీవుడ్ లో 'ఏబీసీడీ 3', 'బాఘి 3', 'చిచ్ఛోరే' వంటి చిత్రాల్లో నటిస్తోంది.