ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన సాహో సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్న అందాల భామ శ్రద్ధా కపూర్‌. అందంతో పాటు అద్భుతమైన నటనతో అభిమానులను అలరిస్తున్న ఈ బ్యూటీ మరో మైల్‌ స్టోన్‌ను అందుకుంది. తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో 50 మిలియన్లు ( 5 కోట్ల) ఫాలోవర్స్ మార్క్‌ను రీచ్‌ అయి రికార్డ్ సృష్టించింది శ్రద్ధా. బాలీవుడ్‌ విలక్షణ పాత్రలతో ఆకట్టుకుంటున్న హార్డ్‌ వర్కింగ్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంటుంది శ్రద్దా కపూర్‌.

ప్రతీ సినిమాలో పక్కింటి అమ్మాయిల కనిపిస్తూ ప్రజలకు మరింత చేరువవుతుంది ఈ బ్యూటీ. శ్రద్ధా పాజిటివ్ చరీష్మా కారణంగా ప్రజలను తన వైపు తిప్పుకోవటంతో పాటు సోషల్ మీడియాలో పేజస్‌లో తన ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకుంటోంది. తన కాంటెంపరరీ స్టార్స్‌ అయిన అలియా భట్ లాంటి వారిని దాటి దూసుకుపోతోంది శ్రద్ధా. ఈ జనరేషన్‌ హీరోయిన్‌లో 50 మిలియన్ల ఫాలోవర్స్‌ను సాధించిన ఒకే ఒక్క నటి శ్రద్ధా కపూర్ కావటం విశేషం.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Being home 🏡✨🥰💜 #SelfLove #TerraceWorkout

A post shared by Shraddha ✶ (@shraddhakapoor) on Mar 23, 2020 at 6:32am PDT

అయితే తన ఫాలోయింగ్‌ సినిమాల ప్రమోషన్‌తో పాటు సామాజిక కార్యక్రమాల కోసం కూడా వినియోగిస్తోంది ఈ బ్యూటీ. తన ఇన్‌స్టా పేజ్ వేదికగా యానిమల్‌ వెల్‌ఫేర్‌ మరియు రైట్స్‌ గురించి అభిమానుల్లో అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తోంది. తనకు అవకాశం వచ్చిన ప్రతీ సారి అభిమానులకు ఎంతో కొంత పాజటివ్‌ థాట్స్‌ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తోంది ఈ బ్యూటీ.