బాహుబలితో దేశవ్యాప్తంగా క్రేజీ హీరోగా మారిన ప్రభాస్ ప్రభాస్ తదుపరి చిత్రం సాహోలో హీరోయిన్ కోసం ముమ్మర కసరత్తు సాహోలో బాలీవుడ్ క్రేజీ భామ శ్రద్ధా కపూర్
బాహుబలి మూవీ తర్వాత నేషనల్ స్టార్ గా మారిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. తర్వాత చిత్రం సాహో ఎప్పుడొస్తుందా అని తెలుగు అభిమానులతో పాటు ఇండియా వైడ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. సాహో గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా టాలీవుడ్, బాలీవుడ్... అన్న తేడా లేకుండా.. దేశంలోని అన్ని భాషల ప్రేక్షుకులు ఆసక్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే ఈ చిత్రంలో హీరో ఎవరు అనే విషయంలో మొదటి నుంచి సరైన క్లారిటీ లేదు. మొదట బాలీవుడ్ బ్యూటీని ఓకే చేద్దామనుకున్నా కుదరక మళ్లీ అనుష్కను అనుకున్నారట.. అయితే అనుష్క డేట్స్ కుదరక రిజెక్ట్ చేసింది. దీంతో ‘సాహో'లో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ఫైనల్ అయిందని, ప్రభాస్ సరసన సుజీత్ దర్శకత్వంలో చేసేందుకు ఆమె సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ సాహోలో ఫైనల్ అయినట్లు వార్తలు రావడంతో ప్రభాస్ అభిమానుల్లో ఆనందం నెలకొంది. శ్రద్ధా కపూర్ మంచి అందగత్తె, టాలెంట్ కలిగిన హీరోయి, ప్రభాస్‌కు బాగా సెట్టవుతుందని అంటున్నారు. అయితే అఫీషియల్‌గా ఈ విషయం ఖరారు కావాల్సి ఉంది.
రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళం, హిందీలో తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ సాహో.. చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా హిట్టయితే బాలీవుడ్లో ప్రభాస్ తిరుగులేని హీరోగా ఎదుగుతాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇక మరో బాలీవుడ్ నటుడు చుంకీ పాండే సాహోలో కీలకమైన పాత్రకు ఎంపికైనట్లు తెలుస్తోంది. చుంకీ పాడేకు సాహో స్క్రిప్టు చాలా నచ్చిందని, అందులో తన పాత్ర కీలకంగా ఉండటంతో వెంటనే చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ చిత్రం స్టంట్స్ కోసం హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ కెన్నీ బేట్స్ ను ఎంచుకున్నారు.
