Asianet News TeluguAsianet News Telugu

గాలికి పోయేది.. తగిలించుకుంటే ఇలాగే ఉంటుంది మరి

  • సోనూ నిగమ్ లౌడ్ స్పీకర్స్ ట్వీట్ వ్యవహారంపై స్పందించిన హాట్ భామ
  • శ్రద్ధా దాస్ ట్వీట్ తో మళ్లీ ట్విటర్ లో రచ్చ
  • సోనూ నిగమ్ పక్కింట్లోనే ఉండే తనకేమీ సౌండ్ వినిపించదట
  • పైగాా సోనూ నిగమ్ తమ గల్లీలో  ట్రాఫిక్ జామ్ చేస్తాడని ఆరోపిస్తోంది
shraddha das tweet on sonu nigam tweet

గతంలో నాలుగైదు సినిమాల్లో నటించి... అందాలు ఆరబోసినా అంతగా నిలదొక్కుకోలేక పోయింది శ్రద్ధా దాస్. ఈ మాజీ అందాల సుందరి బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్.. ముస్లింలు తెల్లవారుజామున చేసే ప్రార్థన వల్ల వినిపించే మైక్ సౌండ్ వల్ల తన నిద్ర డిస్టర్బ్ అవుతోందంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ధ్వజమెత్తుతూ ఓ ముస్లిం పెద్ద సోనూకు గుండు చేయించి ఊరేగిస్తే పది లక్షల రివార్డు ఇస్తాననడంతో.. దీనికి సోనూ కూడా దీటుగా స్పందించాడు.

 


ఆ తర్వాత సోనూ వ్యాఖ్యలపై చెలరేగిన వివాదంపై బాలీవుడ్ అంతా మౌనంగా ఉండగా.. అతడి ఇంటి పక్కనే ఉండే శ్రద్ధా దాస్ మాత్రం వివాదంలో జోక్యం చేసుకుంది. తాను సోనూ పక్క ఇంట్లోనే ఉంటానని.. తనకు సమీపంలోని మసీదులో చేసే అజాన్ వల్ల ఎప్పుడూ అంతగా డిస్టరబెన్స్ కాలేదని.. అదేమంత పెద్దది కాదని అంటోంది. అంతటితో ఆగక ఇంతకుముందు తమ వీధిలో ట్రాఫిక్ అసలు ఉండేదే కాదని.. ఇప్పుడు సోనూ ఇంటిముందు నిలిచే వాహనాల వల్ల.. ట్రాఫిక్ జామ్ అవుతోందని ఆరోపిస్తోంది. పోనీ అంతటితో ఊరుకుందా అంటే ఆగక... అతనిప్పుడే గుండు గీయించుకున్నట్లు తెలిసిందని శ్రద్ధ ఏకంగా సోనూను తీవ్రంగా ఎద్దేవా చేసింది.

 

సోనూ వ్యాఖ్యలపై ఓ మతానికి చెందిన వాళ్లు మండిపడ్డట్లే.. ఇప్పుడు శ్రద్ధ మీదికి మరో మతం వాళ్లు దాడికి దిగారు. పెద్ద లౌకిక వాది లాగా వ్యాఖ్యలు చేస్తోందని.. ఈ వివాదంపై స్పందించాల్సిన అవసరం తనకు లేకున్నా కేవలం పబ్లిసిటీ కోసమే ఆమె ఈ వివాదంపై స్పందించిందని జనం ట్విట్టర్లో తిట్టిపోస్తున్నారు. ఒక్కసారిగా వ్యతిరేకత రావటంతో ఏం చేయాలో పాలుపోక కాసేపట్లో తన ట్వీట్లను డెలీట్ చేసేసి తనకేం తెలీదన్నట్టు సైలెంటైపోయింది శ్రద్ధా. మరి... అవసరమా... గాలికి పోయేది.. తగిలించుకుంటే ఇలాగే ఉంటుంది మరి.

Follow Us:
Download App:
  • android
  • ios