సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధా దాస్ కెరీర్ తొలినాళ్లలో తనను కూడా అవకాశాలిస్తామని పడకగదికి పిలిచారన్న శ్రద్ధ తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషలన్నింటిలో కాస్టింగ్ కౌచ్ వుందన్న శ్రద్ధ

సిద్దూ ఫ్రమ్ శ్రీకాకుళం ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధాదాస్. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సరసన ఆర్య - 2, కరుణాకరన్ దర్శకత్వంలో డార్లింగ్ , దిల్ రాజు మరో చరిత్ర చిత్రాల్లో నటించింది. చూస్తూనే పదేళ్ల కెరీర్‌ పూర్తి చేసుకుంది. స్టార్ డమ్ విషయంలో కాస్త వెనుకపడ్డా.. పలు భాషా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ప్రస్తుతం హిందీ, బెంగాలీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల ఆమె నటించిన బాబూ మొషాయ్ బందూక్ బాజ్ చిత్రం సెన్సార్ కోరల్లో ఇరుక్కుంది. పలు సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ 48 కట్స్ సూచించింది. దాంతో సెన్సార్ బోర్డుపై నిరసనలు వ్యక్తమయ్యాయి. మరోవైపు తెలుగులో రాజశేఖర్ సరసన పీఎస్వీ గరుడవేగ సినిమాలో నటిస్తోంది. కెరీర్ లో అనుకున్నంత సక్సెస్ ఇంకా రాలేదంటున్న శ్రద్ధ ఇప్పటికీ అవకాశాలు అందుకోవడంతో మాత్రం ముందుంటోంది. అయితే కెరీర్ తొలినాళ్లలో తాను కూడా కాస్టింగ్ కౌచ్ సమస్య ఎదుర్కొన్నానంటోంది శ్రద్ధ.

దీనికి సంబంధించి మాట్లాడుతూ... కెరీర్ తొలినాళ్లలో ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నాను. వేషాల కోసం పడకగదికి రమ్మని బలవంతం చేశారు. అవకాశాల కోసం నేను ఎప్పుడూ దిగజారలేదు. నేను ఒప్పుకోకపోవడంతో సినిమాల నుంచి నన్ను తొలగించారు. చాలాసార్లు అనేక సమస్యలు ఎదుర్కొన్నాను. నా పాత్ర నిడివిని చాలా సందర్భాల్లో తగ్గించారు. సినిమాల్లో కనిపించకుండా చేశారు. ఇవన్నీ సినిమా పరిశ్రమలో సర్వ సాధారణం. అంది.

అంతేకాదు ఇది ఏ ఒక్క పరిశ్రమకో పరిమితం కకాలేదని, క్యాస్టింగ్ కౌచ్... తమిళ, కన్నడ, మలయాళ, హిందీ పరిశ్రమల్లో కూడా కనిపిస్తుంది అంది. అన్ని పరిశ్రమల్లోనూ అవకాశం ఇస్తామని చెప్పి.. పడకగదికి రమ్మనేవాళ్లు చాలామంది ఉంటారు. నా కెరీర్ మొదట్లో ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నాను. హీరోయిన్ గా రాణించాలనుకునే ప్రతివారికి ఇలాంటి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయని తన అనుభవాలు గుర్తు చేసుకుంది శ్రద్ధ.