మీటూ అంటే చాలు ప్రతి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నటీమణులు గత చరిత్రలను కూడా బయటకు తీస్తూ బడా సెలబ్రెటీలకు నిద్ర లేకుండా చేస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా తారలు వారికి ఎదురైనా చేదు అనుభవాల గురించి వివరిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం అగ్రనటులను కూడా మీటూ ఉద్యమం కదిలిస్తోంది. 

మీటూ పై స్పందించాలని కొంతమంది హీరోయిన్స్ ప్రశ్నిస్తున్నారు. రీసెంట్ గా కన్నడ నటీమణి శ్రద్దా శ్రీనాథ్ ఏకంగా సూపర్ స్టార్స్ ను నిలదీసే ప్రయత్నం చేసింది. సినిమాల్లో అక్కా చెల్లెళ్ళ కోసం డజన్ల మంది విలన్లను కొట్టే హీరోలు ఇప్పుడు నిజజీవితంలో మీటూ అంటూ బాధపడుతున్న వారి కోసం స్పందించాలని అన్నారు. 

అదే విధంగా వారు ఎలా స్పందిస్తారు అనే విషయం గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందని చెప్పారు. ముఖ్యంగా రజినీకాంత్ - కమల్ హాసన్ మరియు అమితాబ్ బచ్చన్ వంటివారు ఎక్కడ? వారు మీటూ గురించి మాట్లాడినప్పటికీ పూర్తిగా స్పందించలేదని ఇప్పటికైనా వారు వివరణ ఇవ్వాలని శ్రద్దా తెలియజేశారు.