బాలీవుడ్ లో ఎన్నో బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శ్రద్దా కపూర్ సౌత్ లో కూడా అదే తరహాలో కొనసాగాలని అనుకుంటోంది. సాహో సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్న ఈ హాట్ బ్యూటీ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ పై ఒక వివరణ ఇచ్చింది. 

భవిష్యత్తులో కూడా తెలుగు తమిళ్ సినిమాలు చేస్తాను అంటూ ఇప్పటికే చాలా ఆఫర్స్ పెండింగ్ లో పెట్టినట్లు తెలిపింది. అయితే ఆడియెన్స్ ని మెప్పించే పాత్రలైతేనే ఒప్పుకుంటానని చెప్పిన శ్రద్ద సౌత్ ఆడియెన్స్ తనను ఎంతగానో ఇష్టపడుతున్నట్లు స్టేట్మెంట్ ఇచ్చింది.  తన పాత్ర కథలో హైలెట్ అయితేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తానని టార్గెట్ గా పెట్టుకుందట.   

టీజర్ తోనే వారు చూపిస్తున్న అభిమానం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అంటూ మరిన్ని తెలుగు సినిమాలు చేసేందుకు ముందుకు సాగుతానని వివరణ ఇచ్చింది. అయితే అమ్మడు తనకు వచ్చిన ఆఫర్స్ గురించి అయితే సీక్రెట్ మెయింటైన్ చేస్తోంది. రూమర్స్ ప్రకారం భవిష్యత్తులో బేబీ రామ్ చరణ్ - మహేష్ వంటి హీరోలతో వర్క్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.