ప్రస్తుతం ఈ బ్యూటీ సైనా నెహ్వాల్ బయోపిక్ లో నటిస్తోంది. అదే విధంగా అప్పుడపుడు ప్రభాస్ సాహో సినిమా కోసం కూడా పనిచేస్తోంది. ఇకపోతే అమ్మడి గురించి ఓ వార్త ఇటీవల బాగా వైరల్ అయ్యింది.

బాలీవుడ్ లో అతితక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది శ్రద్దా కపూర్. ప్రస్తుతం ఈ బ్యూటీ సైనా నెహ్వాల్ బయోపిక్ లో నటిస్తోంది. అదే విధంగా అప్పుడపుడు ప్రభాస్ సాహో సినిమా కోసం కూడా పనిచేస్తోంది. ఇకపోతే అమ్మడి గురించి ఓ వార్త ఇటీవల బాగా వైరల్ అయ్యింది. ఇటీవల సైనా నెహ్వాల్ బయోపిక్ షూటింగ్ లో ఒక్కసారిగా శ్రద్దా అస్వస్థతకు గురయ్యిందట. 

ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది. గత నెల సెప్టెంబర్ 27 నుంచి అమ్మడు షూటింగ్ కి దూరంగా ఉంటున్నట్లు చిత్ర నిర్మాత భూషణ్ కుమార్ మీడియాకు వివరణ ఇచ్చారు. వైద్య పరీక్షల అనంతరం ఆమెకు రెస్ట్ అవసరమని చెప్పడంతో షెడ్యూల్ ని వాయిదా వేశారు. దర్శకుడు అమోల్ గుప్తే ప్రస్తుతం మరో షెడ్యూల్ ని కంటిన్యూ చేస్తున్నారు. 

సైనా నెహ్వాల్ చిన్ననాటి సన్నివేశాలను తెరకెక్కించడం స్టార్ట్ చేశారు. శ్రద్దా కపూర్ కోలుకునే వరకు ఆమెకు సంబంధం లేని షాట్స్ ని ఫినిష్ చెయ్యాలని చిత్ర స్పెషల్ షెడ్యూల్ ప్లాన్ చేసుకుంది. సైనా బయోపిక్ కోసం శ్రద్దా ముందు నుంచి స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటోంది. ఇక ఇటీవల నిరంతరం షూటింగ్ లో పాల్గొనడంతో ఆమె అస్వస్థకు గురైనట్లు తెలిపారు.