కన్నుమూసిన ప్రముఖ నటుడు సతీందర్ కుమార్ ఖోస్లా, షోలే నటుడికి బాలీవుడ్ సంతాపం
ప్రముఖ బాలీవుడ్ నటుడు.. షోలే ఫేమ్ సతీందర్ కుమార్ ఖోస్లా కన్నుమూశారు. ఆయన మరణంతో బాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి.

ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస మరణాలు కలవరపెడుతున్నాయి. స్టార్స్ ఒక్కొక్కరుగా తిరిగిరాని లోకాలకువెళ్ళిపోతున్నారు. టాలీవుడ్ నుంచి వరుసగా సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణం రాజు, శరత్ బాబు, తాజాగా తమిళ ప్రముఖ నటుడు కూడా మరణించగా.. ప్రస్తుతం బాలీవుడ్ నుంచి షోలే ఫేమ్.. సతీందర్ కుమార్ ఖోస్లా కన్నుమూశారు. బీర్బల్‌గా బాలీవుడ్ లో ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ నటుడు సతీందర్ కుమార్ ఖోస్లా. తన 80 ఏట ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో మంగళవారం సాయంత్రం ఖోస్లా తుదిశ్వాస విడిచారు.
'షోలే' తో బాగా ఫేమస్ అయిన ఈనటుడి మరణ వార్తను అతని స్నేహితుడు జుగ్ను ధృవీకరించారు. అయితే సతీందర్ కార్డియాక్ అరెస్ట్ కారణంగా కన్నుమూశారు. బుధవారం ఆయన అంత్యక్రియలు కూడా పూర్తయినట్టు తెలుస్తోంది . ఇక ఖోస్లా మరణ వార్త వార్తల గురించి తెలుసుకున్న తర్వాత, సినీ & టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (CINTAA) అధికారిక సోషల్ మీడియా లో హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేసింది.
అసోషియేషన్ పోస్టో లో ఇలా రాశారు. "బీర్బల్ అని పిలుచుకునే సంతీందర్ ఖోస్లా మరణంపై సంతాపాన్ని వ్యాక్తం చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఆయన CINTAA లో 1981 నుండి సభ్యుడు. దాంతో ఆయన మరణంపై సభ్యులు షాక్ కు గురయ్యారు. బాలీవుడ్ లో హస్య పాత్రలకు ప్రసిద్ది చెందారు ఖోస్లా.అతని విలక్షణమైన రూపం, బట్టతల, పెద్ద పెద్ద మీసలతో.. అందరూ చూడగానే గుర్తు పట్టేలా.. తన హావభావాలతో నవ్విస్తూ.. నటిస్తూ.. ఏడిపిస్తూ.. నవరస నటుడిగా పేరు తెచ్చుకున్నాడు ఖోస్లా.
సతీందర్ ఖోస్లా.. బాలీవుడ్ లో ఉపకార్, రోటీ కప్డా ఔర్ మకాన్, లాంటి ఎన్నో సినిమాల్లో నటించాడు. క్రాంతితో సహా మనోజ్ కుమార్ ల ఎన్నో సినిమాలకు ఆయన పనిచేశాడు. అయితే, షోలేలో ఖైదీగా అతని పాత్ర చాలా మంది దృష్టిని ఆకర్షించింది. అతను నసీబ్, యారానా, హమ్ హై రహీ ప్యార్ కే మరియు అంజామ్ వంటి చిత్రాలలో కూడా అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఇక సతీందర్ మరణంపై బాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.