మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌పై మరోసారి ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన `ఓజీ` గ్లింప్స్ బీజీఎం కాపీ అంటూ రచ్చ చేస్తున్నారు. దారుణంగా ఆడుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ నటించిన `ఓజీ`(దే కాల్ హిమ్ ఓజీ) సినిమా టీజర్‌ని `ఆంగ్రీ చితా` పేరుతో విడుదల చేశారు. దీనికి విశేష స్పందన లభించింది. యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది. పవన్ కళ్యాణ్‌కి ఇన్నాళ్లకి సరైన సినిమా పడిందని అంటున్నారు. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో సాగే చిత్రమిది. ముంబయి ప్రధానంగా కథ నడుస్తుంది. ముంబయి మాఫియాని ఏలే గ్యాంగ్ స్టర్ పాత్రలో పవన్ కనిపిస్తున్నాడు. ఆయన పాత్ర తీరుతెన్నులు గూస్‌బంమ్స్ తెప్పించేలా ఉన్నాయి.
థమన్ దీనికి సంగీతం అందిస్తున్నారు. `ఓజీ`లో బీజీఎం అదిరిపోయింది. అదే హైలైట్‌గా నిలిచింది. అయితే ఇది కాపీ అంటున్నారు నెటిజన్లు. జనరల్ గా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కాపీ మాస్టర్ అంటున్నారు. ఆయన ఏ ట్యూన్ చేసినా, అది అక్కడి నుంచి,ఇక్కడి నుంచి లేపాడు అంటూ ట్రోల్స్ చేస్తుంటారు. ఇది ఆయనకు కూడా కామన్ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి కాపీ కామెంట్లు ఊపందుకున్నాయి.
`ఓజీ` బీజీఎం సైతం కాపీ అనే అంటున్నారు. అనడమే కాదు ఏకంగా ప్రూప్ కూడా చూపిస్తున్నారు. ఇది ఎలక్ట్రానిక్ కంపెనీ మ్యూజిక్ ట్యూన్. దీన్ని స్వీడిష్ సంగీత కారుడు, నిర్మాత నిక్లాస్ అహ్లస్ట్రోమ్ రూపొందించారు. `స్ల్పాషర్` పేరుతో ఈ మ్యూజిక్ ని రూపొందించారు. నెల రోజుల క్రితం ఎపిడెమిక్ ఎలక్ట్రోనిక్ యూట్యూబ్ ఛానెల్ ఈ మ్యూజిక్ ట్యూన్‌ని అప్‌లోడ్ చేసింది. ప్రస్తుతం ఇది ట్రెండింగ్‌లోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ `ఈజీ` కారణంగా ఇది వెలుగులోకి రావడం విశేషం.
దీన్ని ప్రూప్‌గాచూపిస్తూ థమన్‌ని నిలదీస్తున్నారు. కనీసం నెల రోజులు కూడా కాలేదు కదా, అప్పుడే ఎలా కాపీ కొట్టాలనిపించిందంటూ ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆడుకుంటున్నారు. మీమ్స్ తో రచ్చ చేస్తున్నారు. పాపం పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ రీమేక్, చివరికి మ్యూజిక్ కూడా రీమేకేనా అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. `జులాయి`సినిమాలోని దొంతనం చేసి దొరికిపోయే బ్రహ్మానందం సీన్లని చూపిస్తూ మరింత రచ్చ చేస్తున్నారు నెటిజన్లు. దీంతో నెట్టింట ఇది పెద్ద రచ్చ అవుతుంది. మరి దీనిపై థమన్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

`సాహో` ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతుంది. రెండు భాగాలుగా ఇది విడుదలయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ప్రారంభంలో రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
