Asianet News TeluguAsianet News Telugu

రేటింగ్‌ కోసం ఇంతగా దిగజారుతారా? పిల్లలతో షో చూసేదెలా?.. శ్రీముఖి షోపై ట్రోల్స్..

అత్యంత ఎనర్జిటిక్‌గా, చలాకీతనంతో, చిలిపిగా నవ్వుతూ తనదైన స్టయిల్‌లో యాంకరింగ్‌ చేస్తూ ఆకట్టుకుంటుంది యాంకర్‌ శ్రీముఖి. తాజాగా ఆమె ట్రోల్‌కి గురవుతుంది. ఆమె షోపై విమర్శలు చేస్తున్నారు. 
 

shocking trolls on anchor sreemukhi show how will see with children arj
Author
First Published Apr 22, 2024, 12:00 PM IST

ప్రస్తుతం సినిమాల కంటే టీవీ షోస్‌కి డిమాండ్‌ ఎక్కువగా ఉంది. వాటికి మంచి రేటింగ్‌ వస్తుంది. కామెడీ షోలో, డాన్సు షోలు, సింగింగ్‌ షోలు బాగా ఆదరణ పొందుతున్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్‌ పంచేందుకు ప్రతి టీవీ ఛానెల్‌లో ఏదోరకమైన షో చేస్తూ ఆడియెన్స్ ని అలరిస్తున్నాయి. పోటీలో దూసుకుపోతున్నాయి. టీవీ సెలబ్రిటీల, సీరియల్స్ ఆర్టిస్ట్ లతో చేసే ఫన్‌ షోలు కూడా బాగా ఆదరణ పొందుతున్నాయి. అలా శ్రీముఖి యాంకర్‌గా స్టార్‌ మా పరివార్‌ ఒకటి, అలాగే డ్రామా జూనియర్స్ వంటి షోస్‌ రన్‌ చేస్తుంది. మరోవైపు నీతోనే డాన్స్, ఆహాలో ఒక స్టాండప్‌ కామెడీ షో చేస్తూ బిజీగా ఉంది శ్రీముఖి. 

ఇటీవల షోస్‌ కొంత శృతి మించుతున్నాయి. గేమ్‌లు, టాస్క్ ల పేరుతో కాస్త ఇంటెన్స్, వల్గర్‌గా అనిపించే యాక్టివిటీస్‌ చేయిస్తున్నారు. ముద్దులు పెట్టుకునే, హగ్గింగులు, టచ్చింగ్‌ అయ్యే యాక్టివిటీస్‌ ఇప్పుడు శృతి మించేలా ఉంటున్నాయి. అలాంటిదే శ్రీముఖి చేయించింది. రచ్చకి కారణమయ్యింది. యాంకర్‌ శ్రీముఖి అంటేనే బోల్డ్. ఆమె మాటలే, కాదు యాక్టివిటీస్‌ కూడా బోల్డ్ గా ఉంటాయి. షోలో కమెడియన్లు, ఆర్టిస్టులతో తనదైన స్టయిల్లో ఆడుకుంటుంది. ఆటపట్టిస్తుంది. షోని రక్తికట్టించడంలో తనవంతు పాత్రని పోషిస్తుంది. ఈ క్రమంలో ఆమెకి సంబంధించిన ఓ షో ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. ట్రోల్‌కి గురవుతుంది. 

ఇందులో టీవీ ఆర్టిస్ట్ లు పాల్గొన్నారు. వారితో గేమ్‌ ఆడించింది శ్రీముఖి. నటుడు రవి కృష్ణ, మరో నటి ఈ గేమ్‌లో పాల్గొన్నారు. గేమ్‌ ఏంటంటే చైర్‌లో నటుడు రవికృష్ణ కూర్చున్నాడు. లేడీ కంటెస్టెంట్‌(ఆర్టిస్ట్) బెలూన్‌ తీసుకుని వచ్చి రవికృష్ణ ల్యాప్‌లో పెట్టి, దానిపై ఆమె కూర్చొని ఆ బెలూన్‌ని పగల గొట్టాలి. తాజాగా ఈ గేమ్‌ ఫన్‌ ఇవ్వడంతోపాటు చూడ్డానికి వల్గర్‌గానూ కనిపిస్తుంది. ఈ క్లిప్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇది బూతు షోగా మారుతుందని, టీవీ షోలో ఇలాంటి పాడు పనులేంటి అని, ఇలాంటి షోలను పిల్లలతో ఎలా చూసేది, ఫ్యామిలీ అంతా కలిసి చూడటం కష్టం అని, రాను రాను షోలో దిగజారిపోతున్నాయని, శృతిమించుతున్నాయని కామెంట్‌ చేస్తున్నారు నెటిజన్లు. నానా రకాలుగా ట్రోల్‌ చేస్తున్నారు. 

దీంతో ఇది రచ్చ అవుతుంది. మరికొందరు డోస్‌ పెంచి విమర్శలు చేయడం గమనార్హం. యాంకర్‌ శ్రీముఖితోపాటు ఛానెల్‌ని, కంటెస్టెంట్లని కూడా ఆడుకుంటున్నారు. రేటింగ్‌ల కోసం దిగజారుతున్నారని అంటున్నారు. షోలకు కూడా సెన్సార్‌ పెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే పోటీ ప్రపంచంలో, మోడ్రన్‌ కల్చర్‌ల ఇవన్నీ కామనే అని అంటున్నారు మరికొందరు నెటిజన్లు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios