ఈ రోజు ఉదయం నుంచి ఓ వర్గం మీడియాలో రజనీకాంత్ ఆరోగ్యం పై వార్తలు మొదలయ్యాయి. ఆయన చాలా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారని, తన ఫామ్ హౌస్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని ఆ వార్తలు సారాంశం. ఈ వార్తలు అభిమానులను కలవరపరుస్తున్నాయి. ఆయన కోలుకోవాలని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.

ఈ నేపధ్యంలో రజనీకాంత్ పీఆర్వో రియాజ్ కె అహ్మద్ ...వివరణ ఇస్తూ ప్రకటన విడుదల చేసారు. ఆ వార్తలన్ని ఎవరో సృష్టించిన రూమర్స్ అన్నారు. ఆయన ఆరోగ్యంగా తన పోయిస్ గార్డెన్ రెసిడెన్స్ లో ఉన్నారని అన్నారు. ఇలాంటి రూమర్స్ ని స్ప్రెడ్ చేయద్దని, అభిమానులు ఆందోళన పడద్దని అన్నారు. అలాగే అతి త్వరలో ఆయన తన తాజా చిత్రం అన్నార్తేలో పెండింగ్ పోర్షన్స్ ని ఫినిష్ చేయటానికి సిద్దపడుతున్నట్లు చెప్పారు.

రజనీకాంత్ ‘దర్బార్’ తర్వాత సిరుత్తై శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఈ సినిమా టైటిల్ అన్నార్తె. ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో సీనియర్‌ నటి మీనాతో పాటు, రజనీ కూతురుగా కీర్తి సురేశ్‌ నటించనున్నారని వార్తల వస్తున్నాయి. అయితే ఈ చిత్రంలో తాను నటిస్తున్నట్టు కీర్తి సురేశ్‌ కన్ఫమ్ చేసింది. 

సన్‌పిక్చర్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి డి.ఇమాన్‌ సంగీతం సమకూరుస్తున్నాడు. గ్రామీణ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రానికి 'అన్నాత్త' అనే టైటిల్‌ను ఎవరూ ఊహించలేదు. అయితే ప్రాంతీయతకు అధిక ప్రాముఖ్యతనిచ్చే తమిళ ఆడియన్స్‌కు ఈ టైటిల్‌ బాగానే కనెక్ట్‌ అయ్యింది. ఇక 'అన్నాత్త' టైటిల్‌ పెట్టడానికి కారణం ఈ చిత్రంలో రజనీకాంత్‌ అన్నయ్య పాత్రలో నటిస్తుండడమేనని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. 
 
శివ సినిమా తర్వాత లోకేశ్‌ కనకరాజు చిత్రంలో రజనీ నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే లోకేశ్‌ రజనీకి లైన్‌ చెప్పారని, అది తలైవాకు నచ్చడంతో స్క్రిప్ట్‌పై పనిచేస్తున్నట్లు కోలీవుడ్‌ టాక్‌.