ఇల్లు తాకట్టు పెట్టి చిరంజీవి డబ్బులు రిటర్న్ చేసి… ఆ తరువాత రిలీజ్ ఏ ఇబ్బందులు లేకుండా జరిపించుకున్నారని అంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “భోళా శంకర్” . మొన్న శుక్రవారం రిలీజ్ అయిన ఈ చిత్రం రిలీజ్ రోజే డిజాస్టర్ టాక్ అందుకుంది. అసలే ఆ బాథలో ఉన్న మెగాభిమానులకు మీడియాలో వస్తున్న కొన్ని వార్తలు బాధ కలిగిస్తున్నాయి. అందులో నిజా నిజాలు ఏమిటనేది హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఏమిటా వార్త
భోళా శంకర్ విషయంలో చిరంజీవి నిర్మాత అనిల్ ని ఎంతో ఇబ్బంది పెట్టారని వార్తలు వస్తున్నాయి. తనకు కమిటైన 65 కోట్లు ఇస్తే గానీ కుదరదని చిరంజీవి కూర్చున్నారని ఓ వర్గం మీడియాలో ప్రచారం చేస్తోంది. దాంతో అసలే సినిమాకు బిజినెస్ జరగక ఇబ్బందుల్లో ఉన్ననిర్మాత అనిల్ షాద్ నగర్, సూర్యాపేటలోని కొన్ని స్థలాలు, అలాగే హైదరాబాద్ లోని ఇల్లు తాకట్టు పెట్టి చిరంజీవి డబ్బులు రిటర్న్ చేసి… ఆ తరువాత రిలీజ్ ఏ ఇబ్బందులు లేకుండా జరిపించుకున్నారని అంటున్నారు.
సినిమా రిలీజ్ కి ముందు తాను ఇబ్బందుల్లో ఉన్నా అని… రెమ్యూనరేషన్ లో కొంత భాగం కింద సాటి లైట్ రైట్స్ తీసుకోండి అని అన్నా చిరంజీవి ఫుల్ సెటిల్ మెంట్ కు పట్టుబట్టారని ప్రచారం చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా భోళా శంకర్ చిత్రానికి నైజాం 16-17 కోట్ల ఆఫర్ వచ్చిందట. ఇంతకు ముందు నా హిట్ చిత్రం వాల్తేరు వీరయ్య 33 కోట్లు చేస్తే తక్కువకు అమ్మి నన్ను అవమానిస్తావా అని అనిల్ ని ఆపారట చిరంజీవి అని చెప్పుకుంటున్నారు. దాంతో ఆ ఏరియా కూడా సొంత రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు నైజాం నుండి కనీసం 10 కోట్ల షేర్ కూడా రావటం లేదు. అయితే ఇవన్నీ కావాలనే చిరంజీవి ని బ్యాడ్ చేయటానికి ఓ వర్గం అల్లుతున్న కథనాలు అంటున్నారు.
అయితే నిజా నిజాలు ఎలా ఉన్నా ఈ షాకింగ్ వార్తలు వైరల్ గా మారాయి. కానీ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, చిరంజీవిపై కావాలనే ఇలాంటి కీ టైమ్ లో ఇలాంటి ప్రచారం స్టార్ట్ చేసారని మెగా కాంపౌండ్ వర్గాలు చెప్తున్నాయి. ఏదైమైనా చిరంజీవి ఇలా దిగజారి పట్టుబట్టే రకం కాదని, ఆయనతో పనిచేసిన వారు ఎవరైనా చెప్తారు. ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేసి, చిరంజీవి బ్యాడ్ చేయటం అంటే ఆకాశంపై ఉమ్మి వేయటమే అంటున్నారు.
