Asianet News TeluguAsianet News Telugu

Samantha: ఫస్ట్ టైమ్‌ సమంత ఐటెమ్‌ సాంగ్‌.. `పుష్ప` టీమ్‌ అఫీషియల్‌ అనౌన్స్ మెంట్‌

`పుష్ప` చిత్రంలో ఈ సంచలనం చోటుచేసుకోబోతుంది. బన్నీ, సమంతలపై దర్శకుడు సుకుమార్ ఈ స్పెషల్‌ నెంబర్‌ని ప్లాన్‌ చేయడం విశేషం. దీనికి సంబంధించిన వార్తలు గత రెండు మూడు రోజులుగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం సోమవారం అధికారికంగా ప్రకటించారు. 

samantha special song with allu arjun in pushpa movie official announcement
Author
Hyderabad, First Published Nov 15, 2021, 6:44 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

సమంత(Samantha) డేర్‌ చేస్తోంది. సినీ కెరీర్‌లో ఫస్ట్ టైమ్‌ ఐటెమ్‌ సాంగ్‌(Samantha Special Song) చేయబోతుంది. అది కూడా బన్నీ లాంటి అద్బుతమైన డాన్సర్‌తో కలిసి స్టెప్పులేయబోతుంది. సుకుమార్‌-దేవిశ్రీ ప్రసాద్‌ కాంబినేషన్‌లో వచ్చే ఐటెమ్‌ నెంబర్‌ అంటే అది ఆ సినిమాకే స్పెషల్‌గా నిలుస్తుంది. ఐటెమ్‌ సాంగ్‌ల్లో అదొక టాప్‌ ట్రెండింగ్‌ సాంగ్‌గా నిలుస్తుంది. ఇప్పుడు మరో సంచలనానికి తెరలేపబోతున్నారు. సమంతతో ఐటెమ్‌ సాంగ్‌ చేయించబోతున్నారు సుకుమార్‌.  బన్నీ(Allu Arjun)తో కలిసి సమంతని ఈ స్పెషల్‌ నెంబర్‌ చేయించబోతుండటం విశేషం. దీంతో ఇప్పుడీ విషయం టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌తోపాటు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

`పుష్ప`(Pushpa) చిత్రంలో ఈ సంచలనం చోటుచేసుకోబోతుంది. బన్నీ, సమంతలపై దర్శకుడు సుకుమార్ ఈ స్పెషల్‌ నెంబర్‌ని ప్లాన్‌ చేయడం విశేషం. దీనికి సంబంధించిన వార్తలు గత రెండు మూడు రోజులుగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం సోమవారం అధికారికంగా ప్రకటించారు. సమంతకి ఆహ్వానం పలుకుతూ తమ సంతోషాన్ని పంచుకున్నారు. అడగ్గానే ఇందులో డాన్స్ నెంబర్‌ చేసేందుకు ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. `పుష్ప`లోని ఐదో సింగిల్‌ చాలా స్పెషల్ గా ఉండబోతుందని, ఆ స్పెషల్‌ అవసరమైందని, అందుకోసం మరింత స్పెషల్ ని తీసుకొచ్చామని తెలిపారు. సమంత చేస్తున్న తొలి స్పెషల్‌ సాంగ్‌ అని, కచ్చితంగా ఇది స్పెషల్‌గా, ఎప్పటికీ గుర్తిండిపోయేలా ఉంటుందని చెప్పారు. 

అల్లు అర్జున్‌, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న `పుష్ప` చిత్రానికి సుకుమార్‌ దర్శకత్వం వహిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మితమవుతుంది. ఇందులో ఫాహద్‌ ఫాజిల్‌ విలన్‌గా, సునీల్‌, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన లభించింది. యూట్యూబ్‌లో మిలియన్స్ వ్యూస్‌తో ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇక ఈ సినిమాని డిసెంబర్‌ 17న విడుదల చేయబోతున్నారు. అయితే రిలీజ్‌ డేట్‌పై సస్పెన్స్ నెలకొంది. 

also read: Pushpa: థ్రిల్లింగ్ అప్డేట్.. అల్లు అర్జున్ తో సమంత ఐటెం సాంగ్, 'జిగేల్ రాణి'ని మించేలా మాస్ స్టెప్పులు

మరోవైపు నాగచైతన్యతో విడాకులు ప్రకటించిన అనంతరం మరింత జోష్‌తో సమంత రాబోతుందనే సిగ్నల్స్ ఇస్తూనే ఉంది. గ్లామర్‌ పరంగానూ తాను తగ్గేదెలే అనే అనే సంకేతాలను ఇస్తూ వచ్చింది సమంత. ఇప్పటికే రెండు బైలింగ్వల్‌ చిత్రాలను ఓకే చెప్పింది. ఆమె నటించిన `శాకుంతలం` చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. మరోవైపు తమిళంలోనూ ఓ సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది. దీంతోపాటు బాలీవుడ్‌లోకి ఎంట్రీకి ప్లాన్‌ చేసుకుంటుంది. ఈ క్రమంలో ఫస్ట్ టైమ్‌ ఐటెమ్‌ సాంగ్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం ఇప్పుడు ఆసక్తి నెలకొంది. సమంత ఇకపై కమర్షియల్‌ హీరోయిన్‌గానే రాణించేందుకు సిద్ధమవుతుందని, దీనికి సంబంధించి తనకు ఎలాంటి అడ్డంకులు, హద్దులు లేవనే విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తుందని అంటున్నారు నెటిజన్లు. 

also read: Pushpa: 'ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా' అంటూ వచ్చేస్తున్న బన్నీ.. మరో ఊర మాస్ గెటప్ లో ఐకాన్ స్టార్

Follow Us:
Download App:
  • android
  • ios