టాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. యువ నిర్మాత మహేష్ కోనేరు అకాల మరణం పొందారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. 

టాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. యువ నిర్మాత మహేష్ కోనేరు అకాల మరణం పొందారు. నేడు ఉదయం మహేష్ కోనేరు గుండెపోటుకు గురయ్యారని సమాచారం. ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోవడంతో, ఆయన మరణాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఇప్పుడిప్పుడే మహేష్ కోనేరు పరిశ్రమలో స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదుగుతున్నారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. NTR ట్విట్టర్ వేదికగా... 'ఊహించని విషాదం, నా ప్రియ మిత్రుడు మహేష్ కోనేరు అకాల మరణం పొందారు. ఈ దుర్ఘటన నన్ను పూర్తిగా షాక్ లోకి నెట్టివేసింది. ఏమీ మాట్లాడాలో తెలియని పరిస్థితి. ఆయన కుటుంబానికి, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి' అంటూ... ట్వీట్ చేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

నందమూరి కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన Mahesh koneru ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లకు పీఆర్ గా వ్యవహరిస్తున్నారు.ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పేరుతో నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసి, కళ్యాణ్ రామ్ తో 118 వంటి థ్రిల్లర్ నిర్మించి హిట్ అందుకున్నారు. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మిస్ ఇండియా చిత్రాన్ని కూడా ఆయనే నిర్మించారు. అలాగే సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన తిమ్మరుసు చిత్రానికి కూడా మహేష్ కోనేరు నిర్మాతగా ఉన్నారు. 

Scroll to load tweet…

విజయ్ హీరోగా 2019లో విడుదలైన విజిల్ సినిమాను మహేష్ తెలుగులో విడుదల చేశారు. జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన మహేష్ కోనేరు, నిర్మాతగా పరిశ్రమలో ఎదిగారు. మహేష్ కోనేరు మరణవార్త తెలుసుకున్న చిత్ర ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. 

Also read ప్రముఖ విలక్షణ నటుడు నెడుమూడి వేణు కన్నుమూత