కన్నడ శాండిల్ వూడ్ లో చాలా కాలం తరువాత ఐటి దాడులు అందరిని ఉలిక్కిపడేలా చేశాయి. అనుమానం ఉన్న ప్రతి హీరో ఇళ్ళల్లో సోదాలు జరుపుతున్న ఐటి అధికారులు బ్లాక్ మనీని దృష్టిలో ఉంచుకొని రెయిడింగ్ జరిపినట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. బ్లాక్ మనీని మార్చడం వల్ల హీరోల నివాసాల్లో ఐటి రైడ్స్ జరగడానికి ముఖ్యకారణమని తెలుస్తోంది. 

గత రెండు రోజులుగా యాష్ - సుదీప్ - పునీత్ రాజ్ కుమార్ శివరాజ్ కుమార్ స్థావరాలను సెర్చ్ చేసి కోట్ల రూపాయల ఆస్థి పాత్రలను స్వాధీనం చేసుకున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. యాష్ - అలాగే సుదీప్ పేర్ల మీద వైన్ షాపులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రెస్టారెంట్ లు ఇతర ల్యాండ్ లు వారి పేర్లపై ఉన్నాయని అదే విధంగా పలు కంపెనీలలో బిజినెస్ పాట్నర్స్ గా ఉన్నట్లు సమాచారం అందుతోంది. 

హీరోల కుటుంబ సభ్యులను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి మరి విచారణ జరుపుతుండడంతో ఈ విషయం మరింత చర్చనీయాశంగా మారింది. యాష్ భార్య ఇంటితో పాటు ఆమె తండ్రి ఇంట్లో కూడా ఐటి దాడులు నిర్వహించారు. అయితే ఎంతవరకు అక్రమాల లెక్క తెలిందనే విషయంలో ఇంకా ఫైనల్ క్లారిటీ రావాల్సి ఉంది.