జబర్దస్త్ కామెడీ షోకి ప్రేక్షకుల్లో ఎంతటి ఆదరణ లభించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షోలో కమెడియన్స్ చాలా మంది లేడీ గెటప్స్ వేసుకొని తమ పెర్ఫార్మన్స్ తో  నవ్విస్తుంటారు. అయితే ఇప్పుడు ఓ కమెడియన్ ఏకంగా లింగ మార్పిడి చేయించుకొని అమ్మాయిగా మారిపోయాడు.

అయితే అవకాశాల కోసం, డబ్బు కోసం తాను ఈ విధంగా చేయలేదని చెబుతున్నాడు. ఇంతకీ ఆ కమెడియన్ ఎవరంటే సాయితేజ.. ఒక టీవీ షోలో పాల్గొన్న ఇతడు స్వయంగా ఈ విషయాలను వెల్లడించాడు.

''నాలో చిన్నప్పటి నుండి అమ్మాయి లక్షణాలు ఉన్నాయి. ఎవరికైనా ఈ విషయాలు చెబితే ఏమంటారోనని, కుటుంబ పరువు పోతుందని ఈ విషయాన్ని బయటపెట్టలేదు. ఇంట్లో వాళ్లు బయటకి వెళ్లినప్పుడు నా సోదరి బట్టలు వేసుకొని అద్దం ముందు నిలబడి నన్ను నేను చూసుకొని మురిసిపోయేవాడ్ని.

జబర్దస్త్ షోలో అమ్మాయి గెటప్ వేస్తున్నప్పుడు కూడా చాలా సంతోషపడ్డాను. నాకంటూ కెరీర్ బిల్డ్ చేసుకున్న తరువాత రాజీ పడకూడదని నిర్ణయించుకొని సర్జరీ చేయించుకొని అమ్మాయిగా మారిపోయాను. సమాజం నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటుందనే భయం కూడా నాలో ఉంది'' అంటూ చెప్పుకొచ్చాడు.