ఎన్టీఆర్‌ని చూడాలనుకుంటున్న అభిమానులకు షాక్‌ తగిలింది. ఆయన గెస్ట్ గా నిర్వహిస్తున్న `బ్రహ్మాస్త్ర` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ క్యాన్సిల్‌ అయ్యింది. అందుకు కారణాలు ఏంటనేది..

ఇండియన్‌ సినిమాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం `బ్రహ్మాస్త్ర`. పురణాల ఆధారంగా బ్రహ్మాస్త్ర అస్త్రాలకు సంబంధించిన కథతో రూపొందించిన చిత్రమిది. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రణ్‌ బీర్‌ కపూర్‌, అలియా భట్‌ జంటగా నటించగా, నాగార్జున, అమితాబ్‌ బచ్చన్‌, మౌనీ రాయ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 9న ప్రపంచ వ్యాప్తంగా కనీ వినీ ఎరుగని రీతిలో భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి భాషల్లోనూ ఈ సినిమాని రిలీజ్‌ చేస్తున్నారు. 

తెలుగులో ఈ సినిమాని రాజమౌళి సమర్పిస్తున్నారు. అయితే బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో ప్లాన్‌ చేశారు. నగర శివారులోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ స్థాయిలో ఈ ఈవెంట్‌ని ప్లాన్‌ చేశారు. ఎన్టీఆర్‌ గెస్ట్ గా హాజరు కానున్నారు. ప్రీ రిలీజ్‌ ఈవెంట్ కి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్టీఆర్‌ని చూడాలని అభిమానులు ఆతృతగా వెయిట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ షాకింగ్‌ న్యూస్‌ వైరల్‌ అవుతుంది. ఈ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ క్యాన్సిల్‌ అనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతుంది. 

ఉన్నట్టుండి క్యాన్సిల్‌ అవడానికి కారణం ఏంటనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌అవుతుంది. అయితే పోలీస్‌ పర్మిషన్‌ ఇంకా రాలేదని, అందుకే క్యాన్సిల్‌ అయ్యిందని తెలుస్తుంది. అయితే రామోజీ ఫిల్మ్ సిటీలో కాకుండా దీన్ని నగరంలోని ఏదైనా స్టార్‌ హోటల్‌కి షిఫ్ట్ చేసే అవకాశం ఉందట. ఇంత పెద్ద ఈవెంట్‌ చివరి నిమిషంలో క్యాన్సిల్‌ కావడం అనేది సినిమాపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పొచ్చు. లేటెస్ట్ గా ఈ ఈవెంట్‌ని బంజరాహిల్స్ లోని పార్క్ హయత్ స్టార్‌ హోటల్‌కి మార్చారు. అక్కడ లిమిటెడ్‌ క్రౌడ్‌తో ప్రెస్‌ మీట్‌ని నిర్వహించబోతున్నారు. మరి కాసేపట్లో ఇది ప్రారంభం కానుంది. దీనికి ఎన్టీఆర్‌ గెస్ట్ గా రానున్నారు.