కోలీవుడ్ హీరో విజయ్‌, డైరెక్టర్‌ లోకేష్‌ కనకరాజ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కి జనవరి నెల 13వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల అయిన చిత్రం ‘మాస్టర్‌’. ఈ చిత్రంలో మరో హీరో విజయ్‌ సేతుపతి విలన్‌గా నటించడం గమనార్హం. మాళవికా మోహన్‌, ఆండ్రియా, శాంతను భాగ్యరాజ్‌, అర్జున్‌ దాస్‌, గౌరి జి కిషన్‌, అళగమ్‌ పెరుమాళ్‌, శ్రీమాన్‌, పూవైయార్‌ ఇతర తారాగణం నటించగా, అనిరుథ్‌ సంగీత బాణీలు సమకూర్చారు.  ఈ సినిమా తెలుగులో మిశ్రమ స్పందన లభించినప్పటికీ తమిళ్ లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. 

ఇక ఈ సినిమాను డిజిటల్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసింది. అంతే కాదు ప్రపంచవ్యాప్తంగా మాస్టర్ సినిమా ఈ నెల 29న డిజిటల్ స్ట్రీమింగ్ చేసింది. అదే రోజు మాస్టర్ తెలుగు తమిళ భాషాలతో పాటు హిందీలో కూడా అందుబాటులోకి వచ్చింది. అక్కడా మంచి వ్యూస్ సొంతం చేసుకుంది. అయితే మాస్టర్ సినిమా శాటిలైట్ లో మాత్రం నిరాశ పర్చింది. 

విజయ్ గత చిత్రాలతో పోల్చితే మాస్టర్ రేటింగ్ మరీ దారుణంగా ఉంది. ఇటీవల వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ అయిన మాస్టర్ కు కేవలం 17.1 రేటింగ్ మాత్రమే దక్కింది. విజయ్ గత చిత్రాల్లో బిగిల్ కు 21.9 టీఆర్పీ రేటింగ్ రాగా సర్కార్ కు 21.7 రేటింగ్ దక్కింది. కొన్నాళ్ల క్రితం వచ్చిన తేరీ సినిమాకు కూడా 18 రేటింగ్ కు పైగా వచ్చింది.  

అందుకు కారణం సినిమా రిలీజ్ అయ్యి చాలా రోజులు అవ్వడంతో పాటు అమెజాన్ లో చాలా రోజులుగా స్ట్రీమింగ్ అవుతున్న కారణంగా మాస్టర్ ను టీవీల్లో చూసేందుకు పెద్దగా జనాలు ఆసక్తి చూపలేదు అని చెప్తున్నారు. 

 ఈ చిత్ర నిర్మాణం కోసం పెట్టిన ఖర్చు తక్కువ అయినప్పటికీ... హీరో, విలన్‌ పారితోషికమే అధికంగా ఉన్నట్టు వినికిడి. ప్రధానంగా ఈ చిత్రంలో హీరో విజయ్‌ రెమ్యునరేషన్‌ గత చిత్రం కంటే రూ.20 కోట్ల మేరకు అధికమని కోలీవుడ్‌ వర్గాల సమాచారం ఇక విలన్ గా నటించిన విజయ్‌సేతుపతి కూడా రూ.10 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకున్నట్టు తెలుస్తోంది. వీరితో పాటు ఇతర తారాగణం, నిర్మాణ వ్యయం కలిపి మొత్తం రూ.180 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది.