Asianet News TeluguAsianet News Telugu

బెంగుళూరు రేవ్ పార్టీలో ఇంత జరిగిందా, హీరో శ్రీకాంత్ కూడా ఉన్నారా.. ఇదిగో క్లారిటీ

తెలుగు కన్నడ మీడియాలో ఈ ఉదయం నుంచి బెంగుళూరు రేవ్ పార్టీ అంశం సంచలనంగా మారింది. పోలీసుల విచారణకి సంబంధించిన ఒక్కో అంశం వెలుగులోకి వస్తోంది. హైదరాబాద్ కి చెందిన ఓ బడా వ్యక్తి ఈ రేవ్ పార్టీకి బెంగుళూరులో నిర్వహించారు.

shocking facts revealed by police over bengaluru rave party dtr
Author
First Published May 20, 2024, 3:10 PM IST

తెలుగు కన్నడ మీడియాలో ఈ ఉదయం నుంచి బెంగుళూరు రేవ్ పార్టీ అంశం సంచలనంగా మారింది. పోలీసుల విచారణకి సంబంధించిన ఒక్కో అంశం వెలుగులోకి వస్తోంది. హైదరాబాద్ కి చెందిన ఓ బడా వ్యక్తి ఈ రేవ్ పార్టీకి బెంగుళూరులో నిర్వహించారు. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఓ ఫామ్ హౌస్ లో ఈ పార్టీ జరిగింది. 

పక్కా సమాచారంతో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు పార్టీ జరుగుతున్న చోట రైడ్ చేసారు. దీనితో దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం 101 మంది ఈ పార్టీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. 70 మంది పురుషులు కాగా మిగిలిన వాళ్ళు మహిళలు. పోలీసులు పార్టీ నిర్వహించిన వ్యక్తితో పాటు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో డ్రస్ అందించిన వారు కూడా ఉన్నారట. 

రేవ్ పార్టీ జరిగిన చోట పోలీసులు కొకైన్ లాంటి మత్తు పదార్థాలు 45 గ్రాములు స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో పాల్గొన్న మహిళల్లో డీజేలు, మోడల్స్, బుల్లితెర నటీమణులు ఉన్నట్లు తెలుస్తోంది. సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పార్టీ సాగింది. ఒక్క రోజు పార్టీ కోసం 50 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఆ ఫామ్ హౌస్ గోపాల్ రెడ్డి అనే వ్యక్తికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. 

అంతే కాదు పార్టీ జరిగిన ప్రదేశంలో ఓ కారులో ఆంధ్రప్రదేశ్ వైసిపి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పాస్ పోర్ట్ లభ్యం అయినట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలోమెర్స్డ్ బెంజ్, ఆది లాంటి లగ్జరీ కార్లు 15 వరకు ఉన్నాయట. ప్రస్తుతం పోలీసులు ఈ కేసు గురించి లోతుగా విచారణ చేస్తున్నారు. 

ఈ పార్టీలో నటి హేమ ఉన్నట్లు కన్నడ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలని హేమ ఖండించింది. తాను హైదరాబాద్ లోనే ఓ ఫామ్ హౌస్ లో ఉన్నట్లు క్లారిటీ ఇచ్చింది. ఇక పార్టీ జరిగిన చోట హీరో శ్రీకాంత్ ని పోలిన ఒక వ్యక్తి కనిపించారు. దీనితో శ్రీకాంత్ కూడా అక్కడ ఉన్నారా అనే అనుమానాలు వచ్చాయి. కానీ అది శ్రీకాంత్ కాదని ఆయన కూడా హైదరాబాద్ లో ఉన్నట్లు క్లారిటీ వచ్చింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios