Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss Nonstop: పేరుకే 50 లక్షలు... బిగ్ బాస్ విన్నర్ బిందు మాధవికి దక్కేది ఎంతంటే?


బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్నర్ గా నటి బిందు మాధవి అవతరించింది. తెలుగులో ఫస్ట్ టైం టైటిల్ అందుకున్న అమ్మాయిగా రికార్డులకు ఎక్కింది. మరి విజేతగా ఆమెకు రూ. 50 లక్షల ప్రైజ్ మనీ దక్కినప్పట్టికీ వాస్తవంగా ఆమె చేతికి వచ్చేది చాలా తక్కువ. 

shocking facts about bigg boss nonstop winner bindu madhavi prize money
Author
Hyderabad, First Published May 22, 2022, 7:03 PM IST

బిగ్ బాస్ నాన్ స్టాప్ (Bigg Boss Nonstop) గ్రాండ్ ఫినాలే మే 21న గ్రాండ్ గా జరిగింది. ఫైనల్ కి అరియానా, మిత్ర, అఖిల్, బిందు మాధవి, యాంకర్ శివ చేరారు. ఈ ఐదుగురు కంటెస్టెంట్స్ నుండి టైటిల్ కోసం టాప్ టూ అఖిల్, బిందు మాధవి పోటీపడ్డారు. ఉత్కంఠ పోరులో బిందు మాధవిని విజేతగా నాగార్జున ప్రకటించారు. దీంతో టైటిల్ దక్కించుకోవాలన్న అఖిల్ కి మరోసారి నిరాశ ఎదురైంది. బిగ్ బాస్ సీజన్ 4లో అఖిల్ ఫైనల్ కి చేరిన విషయం తెలిసిందే. అభిజీత్ టైటిల్ అందుకోగా అఖిల్ రన్నర్ గా నిలిచాడు. 

బిగ్ బాస్ నాన్ స్టాప్ టైటిల్ కచ్చితంగా కొడతానని విశ్వాసం వ్యక్తం చేసిన అఖిల్ (Akhil Sarthak)బిందు మాధవితో పోరాడి ఓడిపోయాడు. ఇక విజేతగా బిందు మాధవి రూ. 50 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్నారు. కాగా వాస్తవంలో ఆమెకు దక్కేది చాలా తక్కువ. నాలుగవ స్థానంలో నిలిచిన అరియానా రూ. 10 లక్షల తీసుకొని టైటిల్ రేసు నుండి తప్పుకున్నారు. నాగార్జున ఆఫర్ తీసుకొని ఆమె మంచి పని చేసింది. నిజానికి అరియానాకు టైటిల్ కొట్టేంత ఓట్లు రాలేదు. ఇది గ్రహించి ఆమె ముందుగానే డబ్బులు తీసుకొని తప్పుకున్నారు. 

అరియానా (Ariyana)తీసుకున్న రూ. 10 లక్షలు ప్రైజ్ మనీలో భాగమే. అంటే ఇంకా మిగిలింది రూ. 40 లక్షలు. ఆదాయపన్ను నిబంధనల ప్రకారం టెలివిజన్ షోల్లో గెలుచుకునే ప్రైజ్ మనీపై 32% టాక్స్ చెల్లించాలి. ఆ లెక్కన రూ. 12 లక్షలకు మినహాయించి ఆమెకు రూ. 28 లక్షలు ఇస్తారన్న మాట. గెలుచుకుంది రూ. 50 లక్షలైనప్పటికీ బిందు మాధవి(Bindu Madhavi)కి దక్కేది ఇంతన్న మాట. 

ఇక మొదటి నుండి బిందు మాధవిపై అంచనాలు ఉన్నాయి. ఈమెకు తమిళ్ బిగ్ బాస్ షోలో పాల్గొన్న అనుభవం ఉంది. మొదటి నుండి మంచి గేమ్ ప్లాన్ అమలు చేసిన బిందు మాధవి ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. కంటెస్టెంట్స్ కి షాక్ ఇస్తూ టైటిల్ చేజిక్కించుకుంది.  

Follow Us:
Download App:
  • android
  • ios