సెలబ్రిటీలు ఖరీదైన బట్టలు, యాక్సెసరీస్ వేసుకోవడం మామూలే.. టాలీవుడ్ కంటే బాలీవుడ్ స్టార్లు తమ దుస్తులు, వాచ్ లు ఇలా ప్రతీ దానికి ఎక్కువ ఖర్చు పెడుతుంటారు. ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్లు కూడా మేమేమైనా తక్కువా అన్నట్లు ప్రవర్తిస్తున్నారు.

ఇటీవల హీరో అల్లు అర్జున్ 'టాక్సీవాలా' సినిమా ప్రీరిలీజ్ కోసం వేసుకొచ్చిన టీషర్ట్ ఖరీదు అక్షరాలా రూ.65 వేలు.. బన్నీ అంత కాస్ట్లీ టీషర్ట్ వేసుకోవడంతో అభిమానులంతా షాక్ అయ్యారు. హీరో ప్రభాస్ కూడా అత్యంత ఖరీదైన వాచ్ లను పెట్టుకుంటూ ఉంటాడు. 

తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్.. రాజమౌళి కొడుకు పెళ్లి కోసం జైపూర్ వెళ్లినప్పుడు ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చాడు. దీంతో అభిమానులు, మీడియా ఎన్టీఆర్ ని తమ కెమెరాల్లో బంధించాడు.

ఆ ఫోటోల్లో ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సింపుల్ గా కనిపిస్తున్నా.. ఆ వాచ్ రేట్ ఎంతో తెలుసుకున్న అభిమానులు అవాక్కవుతున్నారు. ఇంతకీ రేట్ ఎంత అనుకుంటున్నారా..?అక్షరాలా రూ.2 కోట్ల 27 లక్షలు. ప్రస్తుతం ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో 'RRR' సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా  సంక్రాంతి తరువాత నుండి రెండో షెడ్యూల్ ని మొదలుపెట్టనుంది.