నాగ్-నానిల 'దేవదాస్'లో షాకిచ్చే క్లైమాక్స్!

shocking climax for nagarjuna-nani's 'devadas' movie
Highlights

మొదట పవర్ ఫుల్ డాన్ గా ఎంట్రీ ఇచ్చే నాగార్జున పాత్ర అనుకోని సంఘటనల కారణంగా మంచి వ్యక్తిగా మారిపోతాడు. అయితే ఆ పాత్రను విషాదాంతంగానే ముగించాలని దర్శకుడు నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది

నాగార్జున, నాని హీరోలుగా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య 'దేవదాస్' అనే సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. తన సినిమాకు తండ్రి టైటిల్ వాడుకున్న నాగార్జున ఇప్పుడు ఆ సినిమాలానే ఈ సినిమాను కూడా విషాదాంతంగా ముగిస్తున్నారని సమాచారం. నిజానికి మన తెలుగు సినిమాల్లో హీరోలు చనిపోతే జనాలు అంత సులువుగా యాక్సెప్ట్ చేయలేరు. ముఖ్యంగా అభిమానులు దాన్ని సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు కాబట్టి దర్శకరచయితలు కూడా సాధ్యమైనంత వరకు ట్రాజెడీ క్లైమాక్స్ లకు దూరంగా ఉంటారు.

అయితే నాగార్జున 'దేవదాస్'లో మాత్రం నాగార్జున పాత్రను విషాదాంతంగా ముగించబోతున్నారని సమాచారం. సినిమాలో నాగార్జున డాన్ పాత్రలో కనిపిస్తుండగా, నాని డాక్టర్  పాత్రలో కనిపించనున్నాడు. మొదట పవర్ ఫుల్ డాన్ గా ఎంట్రీ ఇచ్చే నాగార్జున పాత్ర అనుకోని సంఘటనల కారణంగా మంచి వ్యక్తిగా మారిపోతాడు. అయితే ఆ పాత్రను విషాదాంతంగానే ముగించాలని దర్శకుడు నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది.

కథకు అప్పుడే న్యాయం జరుగుతుందని అంటున్నారు. వినోదం, సెంటిమెంట్, ఎమోషన్ అన్నీ నాగార్జున పాత్రలో ఉంటాయని సమాచారం. మరి ఆ పాత్రను చంపేస్తే.. ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి! 

loader