ప్రభాస్ మైనపు విగ్రహం.. లైసెన్స్ తీసుకోలేదు తొలగించేస్తున్నాం
తాజాగా మైసూర్‌లోని ఓ మ్యూజియంలోనూ అమరేంద్ర బాహుబలి పాత్రకు సంబంధించిన మైనపు విగ్రహం ఒకటి తయారు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రభాస్ కి ఆ మధ్యన లండన్ మేడమ్ టుస్సాడ్స్ (Madame Tussauds) మ్యూజియం.. బాహుబలి అవతార్ లో ఒక మైనపు బొమ్మని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యూజియంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని ప్రతి ఒక్కరు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించారు. అయితే తాజాగా మరో ప్రభాస్ మైనపు బొమ్మ జనం ముందుకు వచ్చింది. ఈ మైనపు బొమ్మ ఏర్పాటుపై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ మండిపడుతున్నారు. అసలేం జరిగింది..
మైసూర్ వాక్స్ మ్యూజియంలో ప్రభాస్ మైనపు విగ్రహాన్ని తయారుచేసినట్లు ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఈ మైనపు బొమ్మని కూడా బాహుబలి అవతార్ లోనే ఏర్పాటు చేశారు. అయితే ఆ విగ్రహం చూస్తే .. అసలు ప్రభాస్ లానే కనిపించలేదు. బాహుబలిలోని అమరేంద్ర బాహుబలి పోజ్ లో ఉన్న ఆ విగ్రహం చూసిన ఎవ్వరు కూడా అది ప్రభాస్ అని అనలేదు. అంత దారుణంగా ఉంది. దాంతో ఆ మైనపు బొమ్మని చూసిన నెటిజెన్స్, ప్రభాస్ అభిమానులు ట్రోల్స్ చేస్తూ వస్తున్నారు. ఇక ఈ బొమ్మని చూసిన మరికొందరు.. డేవిడ్ వార్నర్ లా ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
— Shobu Yarlagadda (@Shobu_) September 25, 2023
ఈ విషయం బాహుబలి నిర్మాత దగ్గరకు చేరింది. ఆయన మండిపడ్డారు. వెంటనే తొలగించాలని డిమాండ్ చేశాడు. అంతేకాకుండా తొలగించకపోతే చర్యలు తప్పవని కూడా తెలిపాడు. “ఇది అధికారికంగా లైసెన్స్ పొందిన పని కాదు.. మరియు మా అనుమతి తీసుకోకుండా.. మాకు తెలియకుండా జరిగింది. దీన్ని తొలగించేందుకు వెంటనే చర్యలు తీసుకుంటాం” అంటూ ట్వీట్ చేసాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
ప్రస్తుతం ప్రభాస్ అమెరికాలో ఉన్నట్లు తెలుస్తుంది. మోకాలు సర్జరీ కోసం అక్కడికి వెళ్లినట్లు సమాచారం. ఆల్రెడీ చికిత్స పూర్తి అయ్యినట్లు వచ్చే వారం ఇండియాకి వస్తాడని, ఇక్కడికి వచ్చిన తరువాత కూడా రెండు వారలు పాటు షూటింగ్స్ కి గ్యాప్ ఇస్తాడని టాక్ వినిపిస్తుంది.