సంచలన దర్శకుడు శంకర్ ప్రస్తుతం 2.0 రిలీజ్ హడావుడిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ ముగిశాయి. రిలీజ్ బిజినెస్ కూడా దాదాపు ఫినిష్ అయ్యింది. ఈ నెల 29న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహకాలు చేస్తున్నారు. 

అయితే ఒక సినిమా విడుదలయ్యాక కానీ మరో ప్రాజెక్ట్ జోలికి వేళ్ళని శంకర్ తన నెక్స్ట్ సినిమాకు సంబందించిన పనులను ముందే మొదలెట్టేసాడు. కమల్ హాసన్ తో శంకర్ భారతీయుడు సీక్వెల్ ను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. అయితే చిత్రం యొక్క ప్రొడక్షన్ డిజైనర్ తో సెట్స్ వర్క్ ను ముందే స్టార్ట్ చేయించాడు శంకర్. 

ప్రొడక్షన్ డిజైనర్ ముత్తురాజ్ నేడు సెట్స్ వర్క్స్ స్టార్ట్ అవుతున్నట్లు చెబుతూ పూజ చేసిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ఇప్పటికే 2.0 కోసం చాలా సమయం వెచ్చించిన శంకర్ భారతీయుడు 2 విషయంలో అలా కాకూడదని తన టీమ్ తో పనులను మొదలెట్టించేస్తున్నాడు. త్వరలోనే భారతీయుడు 2 రెగ్యులర్ షూటింగ్ ను శంకర్ స్టార్ట్ చేయనున్నాడు.