భర్త అరెస్ట్ అయిన తరువాత శిల్పా శెట్టి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో ఆమె ఓ నోట్ పోస్ట్ చేశారు. ప్రముఖ అమెరికన్ రచయిత జేమ్స్ థర్బర్ రాసిన కోట్ తో పాటు కొన్ని వ్యాఖ్యలకు సంబంధించిన ఫోటోను ఆమె ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేశారు. 

పోర్న్ కంటెంట్ ప్రొడక్షన్, యాప్స్ ద్వారా ప్రసారం చేయడం అనే ఆరోపణలపై శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా జులై 19న అరెస్ట్ అయ్యారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రాజ్ కుంద్రాను అదుపులో తీసుకొని విచారిస్తుంటారు. ఈనెల 23వరకు రాజ్ కుంద్రా కస్టడీ కొనసాగనున్నట్లు సమాచారం. పోర్నోగ్రఫీ కేసులో భర్త అరెస్ట్ తరువాత శిల్పా శెట్టి మీడియాకు కనిపించకుండా పోయారు. ఆమె స్పందన తెలుసుకోవాలని మీడియా, పబ్లిక్ ఎదురుచూస్తున్నారు. 

భర్త అరెస్ట్ అయిన తరువాత శిల్పా శెట్టి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో ఆమె ఓ నోట్ పోస్ట్ చేశారు. ప్రముఖ అమెరికన్ రచయిత జేమ్స్ థర్బర్ రాసిన కోట్ తో పాటు కొన్ని వ్యాఖ్యలకు సంబంధించిన ఫోటోను ఆమె ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేశారు. ఎవరు ఏమనుకున్నా, దాని వలన ఎన్ని బాధలు ఎదురైనా.. ఏమి జరిగినా, ఏం జరగబోతున్నా... పట్టించుకోకుండా ఉండు, కానీ చుట్టూ జరుగుతున్న పరిస్థితుల పట్ల అవగాహన కలిగి ఉండు.. అని అర్థం వచ్చేలా ఉన్న జేమ్స్ థర్బర్ వ్యాఖ్యలను షేర్ చేశారు. 

అలాగే ' ఓ దీర్ఘ శ్వాస తీసుకొని, నేను ఇంకా బ్రతికున్నాను అంటే అదృష్టవంతురాలిని అనుకుంటా. గతంలో నేను సవాళ్ళను ఎదుర్కొన్నాను, భవిష్యత్తులో కూడా ఎదుర్కొంటాను, ఎవరూ నా జీవితాన్ని నాకు దూరం చేయలేరు...' అంటూ శిల్పా కామెంట్ చేశారు. మొత్తంగా పరిస్థితులు ఏవైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు, తమ హ్యాపీ లైఫ్ ని ఎవరూ దూరం చేయలేరని శిల్పా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలియజేశారు.