బ్యాక్‌ టూ బ్యాక్ రెండు సినిమాలు ఆగిపోవడంతో కుంగిపోయింది శివానీ. కానీ లక్కీగా `అద్భుతం` మళ్లీ పట్టాలెక్కింది. సినిమా పూర్తయి  ఎట్టకేలకు గత నెలలో విడుదలై పాజిటివ్‌ టాక్‌ని తెచ్చుకుంది. శివానీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు మరో సినిమాతో రాబోతుంది.

హీరో రాజశేఖర్‌ కూతురు శివానీ రాజశేఖర్‌ ఆదిలోనే అడ్డంకులు ఎదుర్కొంది. ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తూ నటించిన `టూ స్టేట్స్` చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. ఆ సినిమా క్యాన్సిల్‌ అయ్యింది. ఆ తర్వాత కమిట్‌ అయిన `అద్భుతం` చిత్రం కూడా ఆగిపోయింది. దీంతో బ్యాక్‌ టూ బ్యాక్ రెండు సినిమాలు ఆగిపోవడంతో కుంగిపోయింది శివానీ. కానీ లక్కీగా `అద్భుతం` మళ్లీ పట్టాలెక్కింది. సినిమా పూర్తయి ఎట్టకేలకు గత నెలలో విడుదలై పాజిటివ్‌ టాక్‌ని తెచ్చుకుంది. శివానీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు మరో సినిమాతో రాబోతుంది.

శివానీ ప్రస్తుతం `డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ` చిత్రంలో నటిస్తుంది. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ‌ సినిమాటోగ్రాఫ‌ర్ కేవి గుహన్ ద‌ర్శ‌కత్వంలో రామంత్ర క్రియేష‌న్స్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా డా. రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మించిన మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ ‌'డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు'(ఎవ‌రు, ఎక్క‌డ‌, ఎందుకు). ఫస్ట్‌ టైమ్ కంప్యూటర్‌ స్క్రీన్ బేస్డ్ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్‌ హీరో హీరోయిన్లుగా నటించారు. `సోనిలివ్`(ఓటీటీ)లో ఈ చిత్రం డిసెంబర్ 24న రాబోతోంది. ఇటీవల ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామంత్ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లోగోను ఎంపీ రఘురామకృష్ణ రాజు ఆవిష్క‌రించారు.

ఇందులో హీరో డా. రాజశేఖర్ మాట్లాడుతూ.. `గుహన్ గారు వండర్ ఫుల్ టెక్నీషియన్. ఆయనతో శివానీ సినిమా చేస్తుందని తెలియడంతో ఆనందమేసింది. సినిమా ఫాస్ట్‌గా వస్తుందని చెప్పారు. ఇప్పుడు కరెక్ట్ సమయానికి వస్తోంది. నేను ఇంకా సినిమా చూడలేదు. గుహన్ గారితో పని చేయాలని అనుకుంటున్నాను. అదిత్‌ మా ఫ్యామిలీ మెంబర్. చాలా కష్టపడి ఈ సినిమాను చేశాడు. www అంటే నాకు జీవితంలో కొన్ని గుర్తుకువస్తాయి. కోవిడ్‌ను చూసి నేను భయపడలేదు. ఈ టీం నుంచే శివానికి కరోనా వచ్చింది. అక్కడి నుంచి నాకు వచ్చింది. నా వల్ల డాడీకి వచ్చిందని శివానీ బాగా ఏడ్చేసింది. ఈ జీవితాన్ని నేను ఎప్పుడూ మరిచిపోను. ఈ చిత్రం మా జీవితంలో ముఖ్య పాత్రను పోషిస్తుంది. మరిచిపోలేని ఈ సినిమా డిసెంబర్ 24న వస్తోంది. అద్భుతం సినిమాకు ఎంత మంచి పేరు వచ్చిందో.. ఈసినిమాకు కూడా అంత మంచి పేరు వస్తుందని అంటున్నారు. నాకు ఎంతో గర్వంగా ఉంది. నా పేరు నిలబెట్టిందని అందరూ అంటుంటే సంతోషంగా ఉంది. ప్రేక్షకులు అందరూ కూడా ఈ సినిమాను చూడాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ.. `చిన్నప్పుడు మా పిల్లలు ఎప్పుడూ షూటింగ్‌లకు వచ్చేవారు. రాజశేఖర్ గారు అవుట్ డోర్‌కు వెళ్తే తీసుకెళ్లేవారు. అప్పుడు కెమెరా వెనక ఉండేవారు. ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చారు. ఊహ వచ్చాక సినిమాల్లోకి వస్తామని మాతో నేరుగా చెప్పేశారు. సినిమాల్లో సక్సెస్ కాకపోతే డిప్రెషన్‌లోకి వెళ్లొద్దు.. వేరే కెరీర్ ఎంచుకోవాలని అన్నాం. శివానీ నటించిన `అద్భుతం` సినిమా మంచి విజయం సాధించింది. ఒక సినిమా ఒక హీరో లేదా ఇద్దరు హీరోలుంటారు. కానీ ఈ సినిమాకు నలుగురు హీరోలు. అదిత్, గుహన్, సైమన్, నిర్మాత గారు. ముందుగా నిర్మాత గురించి మాట్లాడాలి. ఒక్క మాట, ఒక్క షాట్ కూడా అసభ్యంగా, అశ్లీలంగా ఉండొద్దని అన్నారు. ఎన్నో కష్టాలు పడి ఈ సినిమాను నిర్మించారు` అని అన్నారు.

హీరోయిన్ శివానీ రాజశేఖర్ మాట్లాడుతూ.. `అదిత్ వల్లే నాకు ఈ ప్రాజెక్ట్ వచ్చింది. నన్ను నమ్మి ఈ పాత్రను ఇచ్చినందుకు గుహన్ గారికి థ్యాంక్స్. ఇది నాకు చాలా మంచి అవకాశం. నిర్మాత రవి గారిని మొదటి సారిగా చూస్తున్నాను. విజయ్ గారు, ఆయన భార్య వైష్ణవి గారు నన్ను సొంత మనిషిలా చూసుకున్నారు.అద్భుతం సినిమాలో, ఈ సినిమాలోనూ నాకు హీరోతో కాంబినేషన్‌ సీన్లు ఎక్కువగా ఉండవు. సైమన్ గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. ఆయన సాంగ్స్ ఇప్పటికే హిట్ అయ్యాయి. బీజీఎంతో సినిమాను ఎక్కడికో తీసుకెళ్లారు. మిర్చీ కిరణ్ గారు అద్బుతమైన మాటలు అందించారు. డిసెంబర్ 24న సోనీ లివ్‌తో మా సినిమా రాబోతోంది. మా అందరినీ ఆదరించాలని కోరుకున్నారు.

నిర్మాత డా. రవి ప్రసాద్ రాజు ధాట్ల‌ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాను ముందుండి నడిపించిన జీవిత, రాజశేఖర్ గారికి థ్యాంక్స్. కేవీ గుహన్ గారి వల్లే ఈ చిత్రం ఇంత బాగా వచ్చింది. నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. ఇండస్ట్రీ కష్టకాలంలోఉంది. ఇలాంటి సమయంలో మనం ఏదైనా ఒకటి చేయాలని అనుకున్నాం. మంచి టీం ఉందనే ధైర్యంతో మొదలుపెట్టాను. ఇండస్ట్రీ గురించి బయట ఎన్నో రకాలుగా మాట్లాడుతుంటారు. కానీ ఇండస్ట్రీలో చాలా మంచి వారున్నారు. మా సినిమాను చూసి దిల్ రాజు గారు మెచ్చుకున్నారు. సురేష్ బాబు గారు మా సినిమాను చూసి ఎంతో ప్రోత్సహించారు. ఆయన ఇండస్ట్రీకి బలం. ఆయన మా సినిమాను ఎంతో మెచ్చుకున్నారు. యూఎఫ్ఓ లక్ష్మణ్ గారు మాతో మొదటి నుంచి కలిసి ప్రయాణం చేశారు. ఆదిత్య మ్యూజిక్ నిరంజన్, మాధవ్ గారు జంటకవులు. వారు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు.

 ఇదొక మెమోరబుల్ జర్నీ. శివానీ, అదితి అద్బుతంగా నటించారు. అద్భుతం సినిమా మంచి హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమా కూడా హిట్ అవుతుంది. ఈ ఇద్దరికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. సినిమాను చూస్తుంటే కచ్చితంగా వేరే ప్రపంచంలోకి వెళ్తారు. కేవీ గుహన్ గారు అద్బుతంగా తెరకెక్కించారు. తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది. కొరియోగ్రఫర్ ప్రేమ్ రక్షిత్, డైలాగ్ రైటర్ మిర్చీ కిరణ్, మ్యూజిక్ డైరెక్టర్ సైమన్ అద్భుతంగా పని చేశారు. ఈ సినిమాకు విజయ్ ఓ పిల్లర్. సోనీ లివ్‌లో ఈ చిత్రం డిసెంబర్ 24న రాబోతోంది. అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాను చూసి ఇంకా చాలా మంచి కథలు తీయాలి. మంచి దర్శకులు రావాలి’ అని అన్నారు.