Asianet News TeluguAsianet News Telugu

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాజశేఖర్‌.. ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పిన కూతురు శివానీ

హీరో రాజశేఖర్‌.. క్యారెక్టర్‌ ఆర్టిస్టు గా టర్న్ తీసుకున్నారు. నితిన్‌ సినిమాలో చేస్తున్నారు. దీనిపై కూతురు శివానీ రియాక్ట్ అయ్యింది. ఎందుకు ఆ స్టెప్‌ తీసుకోవాల్సి వచ్చిందో వెల్లడించింది.

shivani gave clarity on dady rajasekhar turn into character artist and she interesting things revealed arj
Author
First Published Nov 16, 2023, 9:26 AM IST

టాలీవుడ్‌ యాంగ్రీ మ్యాన్‌ రాజశేఖర్‌.. ఒకప్పుడు స్టార్‌ హీరోల్లో ఒకరిగా రాణించారు. చిరంజీవి, బాలకృష్ణ ల సినిమాలకు పోటీగా రాజశేఖర్‌ మూవీస్‌ విడుదలై విజయాలు సాధించాయి. తిరుగులేని స్టార్‌గా రాణించారు. అయితే ఇటీవల కాలంలో ఆయన సినమాలు వర్కౌట్‌ కావడం లేదు. పలు వివాదాలతో ఆగిపోవడం, సరిగా విడుదల కాకపోవడం జరుగుతుంది. దీనికితోడు ఫెయిల్యూర్స్ కారణంగా ఆయన క్రేజ్‌ తగ్గింది. సినిమాలు ఆశించిన స్థాయిలో రావడం లేదు. చివరగా `శేఖర్‌` మూవీతో డిజప్పాయింట్‌ చేశారు. ఇది ఆర్థికపరమైన ఇబ్బందులను ఫేస్‌ చేసింది. 

ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా టర్న్ తీసుకున్నారు. నితిన్‌ హీరోగా నటిస్తున్న `ఎక్స్ ట్రా ఆర్డినరీమ్యాన్‌` చిత్రంలో ముఖ్య పాత్రలో గెస్ట్ రోల్‌ చేస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్‌ మొదటి వారంలో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో రాజశేఖర్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకోవడంపై తాజాగా ఆయన కూతురు, హీరోయిన్‌ శివానీ రాజశేఖర్‌ స్పందించింది. ఆమె ప్రస్తుతం `కోట బొమ్మాళి` చిత్రంలో నటించింది. శ్రీకాంత్‌, రాహుల్‌ విజయ్‌, వరలక్ష్మి వరత్‌ కుమార్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కాబోతుంది. 

ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా శివాజీ స్పందించింది. వాళ్ల డాడీ రాజశేఖర్‌ నటుడిగా టర్న్ తీసుకోవడంపై ఆమె రియాక్ట్ అయ్యింది. ఎందుకు చేయాల్సి వచ్చింది? తెరవెనుక ఏం జరిగిందనేది ఆమె వెల్లడించింది. రాజశేఖర్‌కి చాలా కాలంగా విలన్‌గా చేయాలనే ఇంట్రెస్ట్ ఉందట. డాడీ చాలా రోజులుగా నెగటివ్‌ రోల్స్ చేయాలనుకుంటున్నారు, ఆయనకు అలాంటి పాత్రలంటే ఇష్టం. విజయ్‌ సేతుపతి, అరవింద స్వామిలా విలక్షణ పాత్రలు చేయాలని ఉంటుంది. కానీ ఇప్పటి వరకు రాలేదు. నితిన్‌ సినిమా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. ఆయన పాత్ర నచ్చి వెంటనే ఓకే చెప్పేశారు. నాకు తెలిసినంత వరకు ఆ పాత్ర అదిరిపోతుందని తెలిపింది శివానీ. 

ప్రస్తుతం ఇంటర్నేషనల్‌ సినిమా ఎక్స్ ప్లోర్‌ అవుతుంది. భాషబేధం లేదు, మన సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నాయి. ఈ నేపథ్యంలో హీరో అనేదానికంటే నటుడిగానూ గుర్తిస్తున్నారు. బలమైన పాత్రకు ఎక్కడైనా ఆదరణ దక్కుతుంది.ఆ గుర్తింపు వస్తుంది. దీంతో రాజశేఖర్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకోవడానికి ఇది కూడా ఓ కారణమని చెప్పింది శివానీ. ఒకప్పుడు హీరోగా చేస్తున్న క్రమంలో విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా చేస్తే ఓ భయం ఉండేది, మార్కెట్‌ పడిపోతుందేమో, తక్కువగా చూస్తారేమో అనే భయాలుండేవి, కానీ పాన్‌ ఇండియా, ఇంటర్నేషన్‌ మూవీ ఎదిగే క్రమంలో ఈ భయాలన్నీ తగ్గిపోతున్నాయని, జనం యాక్టర్స్ గా గుర్తిస్తున్నారని తెలిపింది. డాడీ ఈ నిర్ణయం తీసుకోవడానికి కూడా ఇదో కారణమని చెప్పింది శివానీ. ఆయన నటిస్తున్న సినిమా పెద్ద హిట్‌ అయి, ఆ పాత్రకి మంచి ఆదరణ రావాలని కోరుకుంటున్నట్టు తెలిపింది శివాజీ. 

ఇక తాను నటిస్తున్న `కోట బొమ్మాళి` మూవీ గురించి చెబుతూ, ఇందులో డీ గ్లామర్‌ పాత్రను పోషించినట్టు చెప్పింది. పాత్ర చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించిందని, ఇలాంటి పాత్రలు వదులుకోవద్దనే ఉద్దేశంతో చేశానని వెల్లడించింది శివానీ. మలయాళ మూవీకి ఇది రీమేక్ అని, కానీ చాలా మార్పులు చేసి, నేటి సమకాళీన అంశాలను బేస్‌ చేసుకుని తీశారని తెలిపారు. పోలీస్‌ లపై ఇన్వెస్టిగేషన్‌ ప్రధానంగా సినిమా సాగుతుందని వెల్లడించింది. చాలా కొత్తగా ఉంటుందని తెలిపింది. టీజర్‌, ట్రైలర్‌ విశేషంగా ఆదరణ పొందాయి. `లింగిడి లింగిడి` పాటకి మంచి ఆదరణ వచ్చింది, చాలా హ్యాపీగా ఉందని తెలిపింది. 

తన కెరీర్‌ గురించి చెబుతూ, తాను ఇలాంటి పాత్రలే చేయాలని, హీరోయిన్‌గానే చేయాలనేది ప్లాన్‌ చేయడం లేదని, నాకు పేరొచ్చే పాత్రలు, నటనకు స్కోప్‌ ఉండే పాత్రలు చేయాలని అనుకుంటున్నట్టు చెప్పింది. అదే సమయంలో గ్లామర్‌ పాత్రలు చేయాలని కూడా ఉందని, వాటికి కూడా తాను సిద్ధమే అని పేర్కొంది. అలాంటి పాత్రలు కూడా వస్తాయని ఆశిస్తున్నట్టు చెప్పింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios