Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss Telugu 7: లేడీ సర్పంచ్‌తో పలిహోర కలుపుతున్న శివాజీ.. ఎన్‌ఆర్‌ఐకి కుర్రాడి వెంటపడుతున్న అశ్విని

రెండు ఊర్లకి సంబంధించిన డ్రామా ఆద్యంతం నవ్వులు పూయించింది. సర్పంచ్‌ శోభా, తన మాజీ భర్త తేజ మధ్య గొడవ ఆద్యంత నవ్వులు పూయించింది. 

shivaji tring to mix pulihora with sarpanch priyanka and aswini fidaa to nri yawar in bigg boss 7 house arj
Author
First Published Oct 18, 2023, 11:28 PM IST | Last Updated Oct 18, 2023, 11:28 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 7.. ఏడో వారం.. బుధవారం ఎపిసోడ్‌ ఆద్యంతం క్రేజీగా సాగింది. ఓ వైపు హౌజ్‌ రెండు గ్రామాలుగా విడిపోయి ఆడిన డ్రామాలు వాహ్‌ అనిపించాయి. మరోవైపు కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఎగ్స్ సేకరించే గేమ్‌ ఆద్యంతం రక్తికట్టించేలా సాగింది. ఇక కిచెన్‌లో శివాజీ తన చిన్ననాటి మెమరీస్‌ గుర్తు చేసుకున్నారు. కొతికొమ్మచ్చి వంటి ఆటలు ఆడుకునేవాళ్లమని చెబుతూ ఎమోషనల్‌ అయ్యాడు శివాజీ. 

మరోవైపు స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద గౌతమ్‌ కూర్చొని వాళ్ల ఫ్యామిలీ నుంచి వచ్చిన లెటర్‌ చదువుతూ తన బాధని వ్యక్తంచేశాడు. గ్రూపుగా ఏర్పడి తనని తొక్కేస్తున్నారని, వారిని ఎదుర్కొనే శక్తి ఇవ్వాలని ఆయన తన అమ్మని వేడుకున్నాడు. అవమానాలను తట్టుకునే శక్తిని, ఓటమిని ఎదుర్కొనే శక్తిని ఇవ్వాలని గౌతమ్‌ చెప్పడం ఎమోషనల్‌గా అనిపించింది. 

ఇక గ్రహాంతరవాసి ఎపిసోడ్‌ స్టార్ట్ అయ్యింది. ఓ గ్రహాంతరవాసులకు సంబంధించిన కెప్టెన్సీ టాస్క్ లో హౌజ్‌ గులాబీ పురం, జిలేబీ పురంగా విడిపోయింది. ఇందులో గులాబీ పురం సర్పంచ్‌గా శోభా శెట్టి, ఆమె మాజీ భర్తగా తేజ. ఎన్‌ఆర్‌ఐ కుర్రాడిగా యావర్, టీస్టార్‌ నడిపించే వ్యక్తింగా అమర్‌ దీప్‌, శోభా శెట్టితో తిరిగే వ్యక్తిగా గౌతమ్‌, అల్లరి చిల్లరగా తిరిగే అమ్మాయిగా పూజా నటించారు. మరోవైపు జిలేబీపురంలో ప్రియాంక సర్పంచ్‌గా, భోలే జోతిష్యుడిగా, సందీప్‌ కిల్లీకొట్టు డబ్బ హోనర్‌గా, అశ్విని ఊరంతా వెంటపడే అందమైన అమ్మాయిగా కనిపించారు. అర్జున్‌ విలేజ్‌ రౌడీగా, అతనికి సహాయకుడిగా ప్రశాంత్‌ నటించారు. శివాజీ రెండు ఊర్లకి పెద్దగా నటించాల్సి ఉంటుంది. ఏ ఊరు ప్రజలు ఎక్కువగా గ్రహాంతర వాసులను సంతోషపెడతారో, వారికి కెప్టెన్సీ కంటెండర్‌షిప్‌ లభిస్తుందని తెలిపారు బిగ్‌ బాస్‌.

ఇక రెండు ఊర్లకి సంబంధించిన డ్రామా ఆద్యంతం నవ్వులు పూయించింది. సర్పంచ్‌ శోభా, తన మాజీ భర్త తేజ మధ్య గొడవ ఆద్యంత నవ్వులు పూయించింది. ఇందులో అమర్‌ దీప్‌ గేమ్‌ కూడా ఆకట్టుకుంది. మరోవైపు ఎన్‌ఆర్‌ఐ కుర్రాడిగా యావర్‌ పర్‌ఫెక్ట్ సెట్‌ అయ్యాడు. ఆయన్ని ఇష్టపడే అమ్మాయిలుగా అశ్విని, ప్రియాంక, పూజా కనిపించారు. అయితే రెండు ఊర్లకి పెద్ద శివాజీ.. జిలేబీపురం సర్పంచ్‌ ప్రియాంకతో పులిహోర కలపడం హైలైట్‌గా నిలిచింది. మరోవైపు అశ్వినీని తోటకు రమ్మని చెప్పే డైలాగ్‌లు కేక అనిపించాయి. గల్లీ రౌడీ అర్జున్‌, ఆయన అసిస్టెంట్‌ ప్రశాంత్‌.. తిప్పనా నా చెమ్షా అంటూ చెప్పే డైలాగులు క్రేజీగా ఉన్నాయి. రెండు ఊర్ల మనుషులు డ్రామా పలికించి నవ్వులు పూయించారు.

అనంతరం కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్‌ బాస్‌. ఇందులో ఇద్దరు టీమ్‌ల నుంచి నలుగురు నలుగురు ఈ పోటీలో పాల్గొనాలి. ఒక చోట ఉన్న ఎగ్స్ ని  కింద పడకుండా తీసుకెళ్లి ట్రేలో పెట్టాల్సి ఉంది. నిర్ణీత టైమ్‌లో ఎవరు ఎక్కువ ఎగ్స్ ట్రేలో పెడతారో వారు విన్నర్‌ అవుతారు. అలాగే ఉత్కంఠభరితమైన గేమ్‌లో జిలేబీ టీమ్‌ 18 ఎగ్స్ పెట్టి విన్నర్‌గా నిలిచింది. గులాబీపురం టీమ్‌ 17 ఎగ్స్ పెట్టారు. కానీ ఓటమిపాలయ్యారు. ఇక చివరగా శివాజీ.. ప్రశాంత్‌ ఉన్న టీమ్‌ విన్నర్‌ అవుతుందని చెప్పిన స్టేట్‌మెంట్‌ విషయంలో సందీప్‌, అమర్‌, శోభా శెట్టిలు ఫీలయ్యారు. ఈ విషయం శోభా శెట్టి వాదించగా, శివాజీ సారీ చెప్పారు. 

ఇక సందీప్‌ డేంజర్‌ అని యావర్‌తో అమర్‌ దీప్‌ చెప్పడం ఆశ్చర్యపరించింది. అలాగే.. అమర్‌ దీప్‌ గురించి శివాజీ మాట్లాడిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అతను హీరోనా, కమెడియనా? ఏంటో తేల్చుకోలేకపోతున్నాడని, ఏదోలా బిహేవ్‌ చేస్తున్నాడని, ఆ విషయం హౌజ్‌ లో చెప్పలేకపోతున్నా అని తేజతో చెప్పడం ఆసక్తికరంగా మారింది.  విలేజ్‌ డ్రామా ఇంకా కొనసాగనుంది. మరోవైపు ఈ వారం హౌజ్‌ నుంచి ఎలిమినేషన్‌కి అమర్‌ దీప్‌, గౌతమ్‌, పల్లవి ప్రశాంత్‌, తేజ, అశ్విని, భోలే, పూజా నామినేట్‌ అయ్యారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios