సహనం కోల్పోయిన శివాజీ..హౌజ్‌లో వీరంగం.. మాయాస్త్ర సాధించిన వారి మధ్యే చిచ్చుకి బిగ్ బాస్ స్కెచ్
మాయాస్త్ర కోసం హౌజ్ మేట్స్ మధ్య రసవత్తరమైన పోరు జరుగుతుంది. రణధీర, మహాబలి టీమ్‌లు హోరా హోరిగా పోరాడాయి. కానీ చివరికి మాయాస్త్ర మాత్రం వారికే సొంత మైంది.

బిగ్ బాస్ తెలుగు 7 (Bigg Boss Telugu 7)వ సీజన్ పదో రోజుకి చేరుకుంది. హౌజ్‌లో ఎవరూ కన్ఫమ్ కాదనే ట్విస్ట్ తో ఈ షో ప్రారంభమైంది. పవర్ అస్త్ర దక్కించుకుంటేనే హౌజ్‌లో కన్ఫమ్ అవుతారు. అలా మొదటి వారంలో సందీప్ పవర్ అస్త్రని సాధించి ఐదు వారాలా ఇమ్యూనిటీ పొందాడు. హౌజ్‌లో కన్ఫమ్ అయ్యారు. ఇప్పుడు రెండో వారంలో పవర్ అస్త్ర కోసం హౌజ్ మేట్స్ మధ్య యుద్ధం జరుగుతుంది. పవర్ అస్త్ర దక్కించుకోవాలంటే ముందుగా మాయాస్త్రని సొంతం చేసుకోవాలనే నిబంధన పెట్టాడు బిగ్ బాస్.
హౌజ్ సభ్యులను రెండు సముహాలుగా విభజించారు. రణధీర, మహాబలి అనే రెండు గ్రూపులుగా విభజించాడు. శివాజీ, షకీలా, యావర్, అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంకలు రణధీర గ్రూప్‌లో ఉన్నారు. తేజ, పల్లవి ప్రశాంత్, రతిక, శుభ శ్రీ, దామిని, గౌతం కృష్ణ మహా బలి గ్రూప్‌లో ఉన్నారు. నిన్న జరిగిన బల నిరూపన టాస్క్ లో రణ ధీర టీమ్ విన్నర్‌గా మాయాస్త్రకి సంబంధించిన ఓ కీ ని సాధించింది. ఈ రోజు బుధవారం(పదవ రోజు) మరో ఆటని నిర్వహించారు. `మలుపులో ఉంది గెలుపు` అని స్పిన్ విల్ ముల్లు ఆగే రంగుని ఇరు టీమ్‌ల సభ్యులు ఫాలో కావాల్సి ఉంటుంది. బోర్డ్ నుంచి బయటకు రాకుండా రంగు సర్కిల్‌లో ముందుకు సాగాలి. ఈ టాస్క్ లో కూడా రణధీర టీమ్ విజేతగా నిలిచింది. దీంతో రెండో కీ ని కూడా సాధించారు.
ఫైనల్‌గా రణ ధీర టీమ్ మాయాస్త్రని సాధించారు. అందులో ఉన్న ఆరు చక్రాలను ఆరుగురు సభ్యులు తీసుకున్నారు. దీంతో రణధీర టీమ్ ఆనందానికి అవదుల్లేవ్. కానీ అంతలోనే పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. రణధీర టీమ్ సభ్యుల మధ్యే చిచ్చుకి స్కెచ్ వేశాడు. పవర్ అస్త్ర కోసం ఈ ఆరుగురే పోటీ పడాల్సి ఉంటుందని తెలిపారు. దీంతో వారి ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు.
మరోవైపు ఇంగ్లీష్‌లో, హిందీలో మాట్లాడుతున్న యావర్‌కి బిగ్ బాస్ శిక్ష వేశాడు. ఇంగ్లీష్‌లో, హిందీలో మాట్లాడుతున్నందుకు సారీ చెబుతూ కంటిన్యూగా ఆయా పదాలను పలుకుతూ ఉండాలి. యావర్‌ని డిస్టర్బ్ చేసేందుకు మహాబలి టీమ్ ఎంతో శ్రమించింది. ఈ క్రమంలో శివాజీ సహనం కోల్పోయాడు. యావర్‌ని మరింతగా ఇబ్బంది పెడుతుంటే, చూడలేక సీరియస్ అయ్యాడు. కాసేపు వేడెక్కించే ప్రయత్నం చేశాడు. తాను ఎంత వాయిలెంట్‌గా ఉంటానో అంటూ డంబెల్స్ ని విసిరేశాడు. కాసేపు హడావుడి చేశాడు.
ఇంకోవైపు పవర్ అస్ర్తలను కొట్టేసేందుకు, మాయాస్త్రకి సంబంధించిన కీని దొంగిలించేందుకు మహాబలి టీమ్ కుట్రలు పన్నింది. ఎట్టకేలకు సందీప్ సాధించిన పవర్ అస్ర్తని శుభ శ్రీ దొంగిలించింది. మరి దీని పరిణామాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. రేపు ఎపిసోడ్‌లో అది మరింత రంజుగా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక రెండో వారంలో ఎలిమినేషన్‌కి సంబంధించి నామినేషన్‌లో అమర్ దీప్, గౌతం కృష్ణ, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, రతిక, షకీలా, శోభా శెట్టి, శివాజీ, తేజ ఉన్న విషయం తెలిసిందే. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనేది చూడాలి.