ఇటీవల 7.30గంటలకు `కార్తీకదీపం` సీరియల్‌ ఉంది, మా ఫ్యామిలీ అంతా కలిసి ఆ సీరియల్‌ చూస్తాం. అందుకోసం కాస్త ఐపీఎల్‌ మ్యాచ్‌ టైమ్‌ని మార్చాలని పవిత్రపు శివచరణ్‌ అనే వ్యక్తి బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్‌ గంగూలీకి ట్వీట్‌పెట్టి పాపులరైన విషయం తెలిసిందే. తాజాగా ఆయన్ని `కార్తీకదీపం` సీరియల్‌ టీమ్‌ సర్ప్రైజ్‌ చేసింది.  

సూర్యపేటకు చెందిన పవిత్రపు శివచరణ్‌ అనే వ్యక్తి దీనిపై స్టార్‌మా స్పందించింది. సెప్టెంబర్‌3న ట్వీట్‌ పెట్టాడు. ఇది వైరల్‌ అయ్యింది. ఆయన బాధని అర్థం చేసుకున్న స్టార్ మా స్పందించింది. ఆయన చెప్పింది నిజమే అని తెలిపింది. అయితే ఇందులో `వంటలక్క` పాత్ర ధారి ప్రేమి విశ్వనాథ్‌ డిఫరెంట్‌గా స్పందించింది.ఆయనకు ప్రత్యేకంగా 32 ఇంచెస్‌ టీవీని గిఫ్ట్ గా పంపించింది. ఒక ఉత్తరాన్ని కూడా పంపింది. ఈ ఊహించని గిఫ్ట్ తో శివచరణ్‌ ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. 

ఫ్యామిలీలో కొన్ని సీరియల్స్ కి విపరీతమైన అభిమానం ఉంటుంది. వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ మిస్‌ కారు. మహిళలైతే వాటి కో్సం గొడవలు కూడా పడుతుంటారు. ఆ సీరియల్స్ లో వేరే ఛానెల్స్ చూసేందుకు ఇష్టపడరు. ఒకవేళ అలాంటిదే జరిగితే అది పెద్ద గొడవే. దీంతో ఈ విషయాన్ని తక్కువ చేయలేం. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న వంటలక్క తన అభిమానిని సర్‌ప్రైజ్‌ చేసి ఆకట్టుకుంది.