Shiva Shankar Master: శివశంకర్ మాస్టర్ కి కోవిడ్ నెగిటివ్.. కానీ, వైద్యులు ఏం చెప్పారంటే..
టాలీవుడ్ లో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా కరోనాతో పోరాడిన శివశంకర్ మాస్టర్ చివరకు మృత్యు ఒడికి చేరారు. ఇటీవల శివ శంకర్ మాస్టర్ కు కరోనా సోకడంతో చికిత్స కోసం గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు.
టాలీవుడ్ లో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా కరోనాతో పోరాడిన శివశంకర్ మాస్టర్ చివరకు మృత్యు ఒడికి చేరారు. ఇటీవల శివ శంకర్ మాస్టర్ కు కరోనా సోకడంతో చికిత్స కోసం గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. కొన్ని రోజులుగా శివశంకర్ మాస్టర్ వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. వైద్యులు శ్రమించినప్పటికీ శివశంకర్ మాస్టర్ ప్రాణాలు నిలబెట్టలేకపోయారు.
కరోనా సోకడంతో Shiva Shankar Master ఆరోగ్య పరిస్థితి దిగజారింది. శివశంకర్ మాస్టర్ ఊపిరి తిత్తులు 75 శాతం పాడైనట్లు ఇటీవల ఏఐజీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. శివశంకర్ మాస్టర్ ని కాపాడేందుకు వైద్యులు అన్ని ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ ప్రాణాలు నిలబెట్టలేకపోయారు.
శివశంకర్ మాస్టర్ మృతితో చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు శివ శంకర్ మాస్టర్ మరణించే ముందు ఆయనకు కోవిడ్ నెగిటివ్ అని నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. కానీ అప్పటికే డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది. దీనితో మాస్టర్ తుదిశ్వాస విడిచారు.
శివ శంకర్ మాస్టర్ వందలాది చిత్రాలకు కనుల విందైన డాన్స్ కొరియోగ్రఫీ అందించారు. తమిళంలో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న శివ శంకర్ మాస్టర్.. తెలుగులో మగధీర చిత్రానికి జాతీయ ఉత్తమ కొరియోగ్రఫీ అవార్డు అందుకున్నారు.
తెలుగులో శివ శంకర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన తొలి చిత్రం మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ని మలుపు తిప్పిన 'ఖైదీ'. అప్పట్లో కొరియోగ్రాఫర్ సలీం బిజీగా ఉండడంతో 'రగులుతోంది మొగలిపొద' సాంగ్ కి శివ శంకర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. అప్పుడే టాలీవుడ్ కి మాస్టర్ ప్రతిభ అర్థం అయింది.
అలా శివ శంకర్ మాస్టర్ నెమ్మదిగా టాలీవుడ్ లో పాపులర్ కొరియోగ్రాఫర్ అయ్యారు. ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు, ఏఎన్నార్ ల చిత్రాలకు కొరియోగ్రఫీ అందించారు. ఎన్టీఆర్ గారిలో కోపం చూశానని.. కృష్ణ, శోభన్ బాబు కోపగించుకోవడం ఎప్పుడూ చూడలేదని శివశంకర్ మాస్టర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇదిలా ఉండగా శివశంకర్ మాస్టర్ అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు మహా ప్రస్థానంలో జరగనున్నాయి.
Also Read: Shiva Shankar master:సాయం అందినా దక్కని ప్రాణం... శివ శంకర్ మృతి తీరని విషాదం