స్టార్ హీరోయిన్ గా సౌత్ లో ఒకప్పుడు చక్రం తిప్పిన రోజాను హీరోయిన్ గా  పరిచయం చేసింది శివ ప్రసాదే. 25కి పైగా సినిమాల్లో నటించిన ఆయన పలు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన డైరక్ట్ చేసిన 'ప్రేమ తపస్సు' - 'టోపీ రాజా స్వీటీ రోజా' చిత్రాల్లో రోజా హీరోయిన్ గా కనిపించారు. 

కథానాయికగా ప్రేమ తప్పస్సు సినిమా ద్వారా రోజా సినీ తెరకు పరిచయం అయ్యారు. అయితే సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ స్వీటీగా రోజా తన గ్లామర్ తో అప్పటి  కుర్రకారును ఎట్రాక్ట్ చేసి ప్రశంసలు అందుకున్నారు. శివ ప్రసాద్ తన రెండవ సినిమా టోపీ రాజా స్వీటీ రోజాలో కూడా రోజాను కథానాయికగా సెలెక్ట్ చేసుకున్నారు. 

ఆ తరువాత రోజా తమిళ్ తెలుగులో వరుస అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. అందుకు ప్రధాన కారణం శివ ప్రసాద్ మేకింగ్ స్టైల్. దర్శకుడిగా తన పనితాన్ని ఆ సినిమాల ద్వారా చూపించారు. ఆ రెండు సినిమాలతోనే హీరోయిన్ గా రోజా క్లిక్కయ్యారు

1991లో రిలీజైన ఆ సినిమాకు హీరో రాజేంద్ర ప్రసాద్ సంగీతం అందించడం విశేషం. అనంతరం శివ ప్రసాద్ ఇల్లాలు - కొక్కరకొ కో వంటి రెండు సినిమాలకు దర్శకత్వం వహించి ఆ తరువాత దర్శకుడిగా కంటే నటుడిగా శివప్రసాద్ బిజీ అయ్యారు.