శ్రియా, నీహారిక కొణిదల కోసం వరుణ్!

First Published 18, Jun 2018, 1:15 PM IST
Shirya, Niharika film launched by Varun Tej and Krish
Highlights

శ్రియ శరణ్, నీహారిక కొణిదెల చిత్రానికి వరుణ్ తేజ్ క్లాప్

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ "కంచె"  "మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు" నందమూరి  బాలకృష్ణ "గౌతమిపుత్ర శాతకర్ణి" వంటి విజయవంతమైన చిత్రాలకు కెమెరామెన్ గా పనిచేశారు. మొదటిసారి జ్ఞాన శేఖర్ సినిమా నిర్మాణం వైపు అడుగుపెడుతున్నారు.  

జ్ఞాన శేఖర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న మొదటి సినిమా ప్రారంభోత్సవ వేడుకకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, డైరెక్టర్ క్రిష్, రాజకీయ నాయకుడు గొట్టిముక్కల పద్మా రావ్, నిర్మాతలు రాజీవ్ రెడ్డి, సాయి బాబు ముఖ్య అథితులుగా పాల్గొన్నారు. వరుణ్ తేజ్ క్లాప్ కొట్టగా, తొలి షార్ట్ కు క్రిష్ గౌరవ దర్శకత్వం వహించారు. పద్మారావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

శ్రియ శరణ్ , నీహారిక కొణిదెల ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. కమర్షియల్ అంశాలతో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి సుజనా దర్శకత్వం వహిస్తున్నారు. జ్ఞాన శేఖర్ ఈ చిత్రాన్ని రమేష్ కరుతూరితో కలిసి సంయుక్తంగా క్రియా ఫిలిం కార్పొరేషన్ మరియు కాళీ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు.

నటీనటులు: 

శ్రియ శరణ్ , నీహారిక కొణిదెల

డైరెక్టర్: సుజనా

నిర్మాతలు: జ్ఞాన శేఖర్, రమేష్ కరుతూరి

బ్యానర్: క్రియా ఫిలిం కార్పొరేషన్, కాళీ ప్రొడక్షన్స్

సంగీతం: ఇళయరాజా

సినిమాటోగ్రాఫర్:  జ్ఞాన శేఖర్

ఆర్ట్: జే. కె.మూర్తి

loader