కోలీవుడ్ హీరో శింబు ప్రయోగాలు చేయడంలో చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తాడని చెప్పవచ్చు. కాంట్రవర్సీ డోస్ పెంచుతూ సినిమాలతో ఎదో ఒక రచ్చ చేసే శింబు ఎప్పుడు లేని విధంగా ఫ్యాన్స్ కి ఒక సరికొత్త కిక్ ఇవ్వబోతున్నాడు. నెక్స్ట్ సినిమా కోసం ఊహించని విధంగా శింబు బరువు తగ్గాడు. 

చాలా రోజుల తరువాత తన బ్రదర్ పెళ్లిలో కనిపించిన శింబు బరువు తగ్గినట్లు క్లియర్ గా అర్ధమయ్యింది. అయితే నెల రోజుల్లోనే ఫిట్ నెస్ లో మార్పులు తేవడమనేది చాలా రిస్క్ తో కూడుకున్న పని. కానీ శింబు ఎలాంటి సమస్యలు లేకుండా 13 కేజీలు తగ్గాడు. 

37రోజుల్లోనే సినిమా లుక్ కోసం బరువు తగ్గాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో "మానడు" అనే సినిమా చేస్తోన్న శింబు ఆడియెన్స్ కి తన లుక్స్ తోనే షాక్ ఇవ్వనున్నాడట. త్వరలో సినిమాకు సంబందించిన ఒక స్పెషల్ లుక్ ని కూడా రిలీజ్ చేసేందుకు దర్శకుడు రెడీ అవుతున్నాడు.