అప్పట్లో కవిత కుంద్రా ఆరోపణలపై మౌనం వహించిన రాజ్ కుంద్రా దాదాపు 12ఏళ్ల తరువాత స్పందించడం ఆసక్తికరంగా మారింది. తాజా ఇంటర్వ్యూలో రాజ్ కుంద్రా కవితతో తాను విడిపోవడానికి అసలు కారణాలు ఏమిటో తెలిపాడు.
బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి 2009లో పారిశ్రామికవేత్త రాజ్ కుంద్రాను వివాహం చేసుకున్నారు. అయితే రాజ్ కుంద్రాకు శిల్పా శెట్టి రెండవ భార్య. కవిత కుంద్రాతో విడాకులు తీసుకున్న రాజ్ కుంద్రా రెండవ వివాహం శిల్పా శెట్టిని చేసుకున్నారు. రాజ్ కుంద్రాతో విడాకుల సమయంలో కవిత కుంద్రా హీరోయిన్ శిల్పా శెట్టిపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాజ్ కి శిల్పా శెట్టితో ఉన్న ఎఫైర్ కారణంగానే విడాకులు తీసుకున్నట్లు కవిత ఆరోపణలు చేశారు. అప్పట్లో మీడియాలో కవిత కుంద్రా వ్యాఖ్యలు సంచలనం రేపాయి.
కవిత కుంద్రా ఆరోపణలపై మౌనం వహించిన రాజ్ కుంద్రా దాదాపు 12ఏళ్ల తరువాత స్పందించడం ఆసక్తికరంగా మారింది. తాజా ఇంటర్వ్యూలో రాజ్ కుంద్రా కవితతో తాను విడిపోవడానికి అసలు కారణాలు ఏమిటో తెలిపాడు. సెన్సేషన్ కోసం కవితా కొన్ని మీడియా సంస్థలకు డబ్బులు చెల్లించి సెలబ్రిటీ అయినా శిల్పా శెట్టిపై నిరాధార వార్తలు ప్రచారం చేయించారు. ఆమె ఆరోపణలలో ఎటువంటి నిజం లేదు అన్నాడు.
కవితా తరచూ నా కుటుంబ సభ్యులతో గొడవపడుతూ ఉండేది. కుటుంబంలో ఒక సభ్యురాలిగా ఆమె మెలిగేవారు కాదు. ఆమె ప్రవర్తన అనేక ఫ్యామిలీ ప్రాబ్లెమ్స్ కి కారణం అయ్యింది. అందుకే ఆమె నుండి విడాకులు తీసుకొని విడిపోయాను... అని రాజ్ కుంద్రా తెలిపారు. రాజ్ కుంద్రా కవితపై ఇలాంటి ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆమె ఎలా స్పందిస్తారో చూడాలి.
