బాలీవుడ్ నటి శిల్పా శెట్టి తెలుగులో కూడా కొన్ని చిత్రాల్లో నటించింది. ఇప్పటికీ కూడా స్లిమ్ బాడీ మైంటైన్ చేస్తూ యువ హీరోయిన్లకు పోటీగా నిలుస్తోంది. తాజాగా ఆమె విడాకులు తీసుకోబోతుందంటూ వార్తలు వినిపించాయి. దీంతో ఆమె సన్నిహితులు, అభిమానులు ఆందోళన చెందారు.

అయితే తరువాత అసలు విషయం తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. శిల్పా, అనురాగ్ బసు, గీతా కపూర్ లు 'సూపర్ డాన్స్ 3' అనే రియాలిటీ షోకి న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు.

ఈ క్రమంలో శిల్పకి తెలియకుండా.. అనురాగ్ ఆమె ఫోన్ తీసుకొని 'నేను, రాజ్ కుంద్రా విడాకులు తీసుకోవాలనుకుంటున్నాం' అంటూ ఆమె తల్లి సునంద శెట్టికి సందేశం పంపారు. దాంతో శిల్ప  కుటుంబ సభ్యులు కంగారు పడిపోయారు. దీంతో సునంద శెట్టి.. శిల్ప కి ఫోన్ చేసి ఇదంతా నిజమేనా అని అడిగారు.

ఆ తరువాత శిల్పకు గీతాకపూర్ అసలు విషయం చెప్పడంతో వెంటనే శిల్ప తన తల్లికి ఫోన్ చేసి.. అదేం లేదని, జోక్ చేశారని.. ఇలాంటి విషయాలు నాకు నేనుగా ఇంటికి వచ్చి చెప్పే వరకు నమ్మొద్దని చెప్పిందట. 11 సంవత్సరాల క్రితం శిల్పా, రాజ్ కుంద్రాని ప్రేమించి పెళ్లి చేసుకొంది. ఈ జంటకి ఓ కుమారుడు కూడా ఉన్నాడు.