బిగ్ బాస్ సీజన్ 3లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన శిల్పా చక్రవర్తి రెండు వారాలు కూడా హౌస్ లో ఉండకుండానే ఎలిమినేట్ అయింది. బయటకి వచ్చిన ఈమె కొన్ని షాకింగ్ విషయాలను వెల్లడించింది. శ్రీముఖితో తనకు ఉన్న గొడవ ఏంటి అనే విషయాలపై స్పందించింది. బిగ్ బాస్ హౌస్ లో శ్రీముఖి మైండ్ గేమ్ ఆడుతోందని.. శ్రీముఖి ఎవరో తనకు తెలియదని.. కానీ ఆమె బిగ్ బాస్ హౌస్ లో ఏదేదో చెప్పుకుంటోందని తెలిపింది.

శిల్పకు నేనంటే పడదని అందరికీ చెబుతుందని కానీ అంత సీన్ లేదని చెప్పింది. తనకు శ్రీముఖి అసలు పరిచయమే లేదని.. ఒకసారి ఎయిర్ పోర్ట్‌లో కనిపిస్తే హాయ్ అంటే హాయ్ అనుకున్నామని అంతే తప్ప మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవ జరగలేదని క్లారిటీ ఇచ్చింది. శ్రీముఖి మాటలు విన్నాక ఆశ్చర్యం వేసిందని.. ఆమె మాట్లాడేది నా గురించేనా..? అని డౌట్ వచ్చిందని చెప్పింది.

శ్రీముఖి గురించి తనకు అసలు ఏమీ తెలియదని.. తనకు అబద్దాలు చెప్పే అవసరం లేదని.. ఈరోజు వరకు ఇండస్ట్రీలో ఎవరితోనూ ఎలాంటి వివాదం లేదని.. కానీ శ్రీముఖి ఏ బెసిసి మీద అలా చెప్పిందో తనకు అర్ధం కాలేదని.. బహుసా అది తన గేమ్ స్ట్రాటజీ అనుకుంటున్నా అంటూ అసహనం వ్యక్తం చేసింది.

 తన మీద తప్పుడు కామెంట్స్ చేసి సింపతీ పొందొచ్చని శ్రీముఖి భావించి ఉంటుందని.. అందుకే తనకు ఓట్లు తగ్గి ఉండొచ్చని అభిప్రాయాన్ని వెల్లడించింది. ''గేమ్ కోసం నా వ్యక్తిత్వాన్ని మరీ ఇంత దారుణంగా తగ్గిస్తుందా? ఇంత దిగజారుతుందా? ఈ విషయంలో చాలా డిజప్పాయింట్ అయ్యా..'' అంటూ శిల్పా చక్రవర్తి తన ఆవేదన వ్యక్తం చేసింది.