ప్రస్తుతం ఉన్న గ్లామర్ ప్రపంచంలో తారలు ప్రతీరోజూ వార్తల్లో ఉండాలని భావిస్తున్నారు. ఏదో విధంగా కవరేజ్ దక్కించుకోవడం కోసం తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కేవలం ఎక్స్ పోజ్ చేసినంత మాత్రానా అవకాశాలు వస్తాయని చెప్పలేం.

నేటితరం కుర్ర హీరోయిన్లు దిశాపటానీ, సారా అలీఖాన్ వంటి వారు అందాల ప్రదర్శనలో రెచ్చిపోతుంటే మరి చిన్న చితకా వాళ్లు ఎక్స్ పోజ్ చేస్తే దానికి విలువేముంటుంది. అందుకే వారు డోస్ మరింత పెంచుతున్నారు. ఈ క్రమంలో షెర్లిన్ చోప్రా, పూనం పాండే వంటి వారు ఎక్స్ పోజింగ్ విషయంలో హద్దులు దాటుతున్నారు.

రెగ్యులర్ సోషల్ మీడియాలో ఇలాంటివి ఎంటర్టైన్ చేయరు కాబట్టి ప్రైవేట్ గా యాప్స్ తయారు చేయించుకొని అందులో వీడియోలు పెడుతున్నారు. అయితే పోర్న్ వెబ్ సైట్స్ కి వీటికి పెద్ద తేడా లేదనే చెప్పాలి. తమకి కవరేజ్ రావడం కోసం నగ్నంగా కనిపించడానికి కూడా వెనుకాడడం లేదు ఈ తారలు.

ఒకరితో మరొకరు పోటీ పడుతూ మరీ అందాల ఆరబోత చేస్తున్నారు. నెటిజన్లు ఎన్ని కామెంట్స్ చేస్తున్నా.. వారి ఉనికిని నిలుపుకోవడం కోసం వాటిని పట్టించుకోకుండా సెమీ న్యూడ్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూనే ఉన్నారు.